శుభవార్త చెప్పిన '' అనుష్క''
హీరోయిన్ అనుష్క శెట్టి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అతి తక్కువ కాలంలోనే అనుష్క తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు. తెలుగులో స్టార్ హీరోలందరితోనూ నటించి ఫుల్ పాపులారిటీని సంపాదించుకుందామె. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంది. ముఖ్యంగా అరుంధతి సినిమాతో అనుష్క రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. తెలుగులో హీరోలతో సమానంగా అనుష్కకు మార్కెట్ ఉందంటే అతిశేయోక్తి కాదు.
అయితే గత కొంతకాలంగా అనుష్క సినిమాలు చేయడం తగ్గించేసిందనే చెప్పాలి. జీరోసైజ్ సినిమాతో లావు పెరగిన అనుష్క తరువాత బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేసింది. దాదాపు 100 కేజీలకు పైగా బరువు పెరిగి షాకిచ్చింది. ఆవెంటనే నిశ్శబ్దం సినిమా కోసం బరువు తగ్గి మాములు స్థితిలోకి వచ్చింది. గతేడాది యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో అనుష్క ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. ఆ తరువాత మరే సినిమాను అనుష్క అంగీకరించలేదు. కథ నచ్చితే తప్పిస్తే అనుష్క సినిమా ఒప్పుకోదనే విషయం తెలిసిందే.అయితే తాజాగా అనుష్క తన కొత్త సినిమాపై అఫిషియల్‌గా ఎనౌన్స్‌మెంట్ చేసింది. 'కథానర్' అనే సినిమాలో నటించడానికి అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఈ సినిమాతో అనుష్క మలయాళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇండస్ట్రీకి వచ్చిన 19 ఏళ్ళ తరువాత మొదటిసారి మలయాళం సినిమాలో నటించబోతుంది అనుష్క.
'కథానర్' అనే సినిమాలో జయసూర్య, అనుష్క శెట్టి మెయిన్ లీడ్స్‌లో నటించబోతున్నారు. సోమవారం ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. చిత్ర యూనిట్ అనుష్కకు ఘన స్వాగతం పలికారు. అక్కడ అనుష్కను చూసిన వారంతా కూడా షాక్‌కు గురైయ్యారు. ఇన్నాళ్లుగా బొద్దుగా కనిపించిన అనుష్క.. ఇప్పుడు బరువు తగ్గి స్లిమ్ లుక్‌లోకి మారిపోయింది. దీంతో మేము చూస్తున్నది అనుష్కనేనా ? అంటూ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అనుష్క స్లిమ్‌గా మారిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
-
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
విజయ్ దేవరకొండ - రష్మికల్లో ముందు ప్రపోజ్ చేసింది ఎవరో తెలుసా? -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
మరో కొత్త కాన్సెప్ట్..? గ్యాప్ ఇవ్వు అన్న కాస్తా..! -
గద్దర్ అవార్డుల్లో గీతా ఆర్ట్స్ హవా.. ఆయన మంత్రాంగం పనిచేసిందా? -
"నేను ఎంతమందితో తిరిగినా అది నీ ప్రాబ్లెమ్ కాదు" -
వీడియో వైరల్: స్నేహా రెడ్డికి ఖరీదైన బహుమతి ఇచ్చిన అల్లు అర్జున్.. -
ట్రైలర్ కే థియేటర్లు తగలబడుతున్నాయి.. ఇక సినిమా రిలీజ్ అయితే..!! -
లాగిపెట్టి కొట్టిన అపరిచితుడు.. నడిరోడ్డుపై ఏడుస్తూ హీరోయిన్ గోడు! వీడియో -
నా కథను మానభంగం చేసేశారు..! -
"ఇది భగత్ గీత.. దమ్మున్నోడు దాటొచ్చు" -
ఆ హీరోని చూస్తే సింహాన్ని చూసినట్టే - కోర్టు బ్యూటీ శ్రీదేవి












Click it and Unblock the Notifications