Anushka shetty: హీరోయిన్ అనుష్క శెట్టి ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటో తెలుసా!!
సహజంగా అభిమాన హీరో కానీ అభిమాన హీరోయిన్ కానీ ఏం చేసినా ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతూ ఉంటారు. వారి గురించి ఏ చిన్న విషయం తెలిసినా గొప్ప విషయం తెలిసినట్టు ఫీల్ అవుతారు. తాము అభిమానించే హీరో, హీరోయిన్ల వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకోవాలని చాలామంది అభిమానులు తాపత్రయపడుతూ ఉంటారు.
అనుష్కకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు
ఇక ఇదే కోణంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుని స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన అనుష్కకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. అనుష్కా శెట్టి ఇండస్ట్రీలో అందరూ స్వీటీగా చెప్పుకునే అనుష్క బాహుబలి, అరుంధతి, భాగమతి వంటి సినిమాలలో చాలా పవర్ ఫుల్ గా నటించారు. కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారు.

అనుష్క క్యారెక్టర్ ఎలాంటిదంటే
అసలు అనుష్క వ్యక్తిత్వం ఎలాంటిది? ఆమె ఒరిజినల్ క్యారెక్టర్ ఏమిటి? అన్నది తెలుసుకోవాలని ప్రతి అభిమాని కోరుకుంటారు. ఇక అలాంటి అనుష్క అభిమానులకు ఆమె ఒరిజినల్ క్యారెక్టర్ గురించి ఆమె దగ్గర పని చేసిన మేకప్ మ్యాన్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సినిమాలలో చాలా డైనమిక్ రోల్స్ పోషించిన అనుష్క నిజజీవితంలో చాలా సున్నిత మనస్కరాలని, ఆమె ఎవరికైనా సమస్య వస్తే వారి సమస్యను తన సమస్యలాగా భావించి బాధపడుతుందన్నారు.
డబ్బుల విషయంలో నిర్మాతలతో అనుష్క తీరు ఇలా
ఆమెకు చాలా దయాగుణం ఉంటుందని ఆమె దగ్గర పనిచేసిన మేకప్ మ్యాన్ తాజాగా ఆమె గురించి చెప్పుకొచ్చారు. తాము చాలా మంది హీరోయిన్లను చూసామని కానీ అనుష్కలాంటి మంచి మనస్తత్వం, ఆమెకు ఉన్నటువంటి మంచి గుణాలు చాలా మంది హీరోయిన్లకు లేవని అతను తెలిపాడు. అంతేకాదు డబ్బుల విషయంలో నిర్మాతలను అనుష్క అస్సలు ఇబ్బంది పెట్టరని ఆయన చెప్పుకొచ్చారు.
స్వీటీ మనస్తత్వం పై మేకప్ మ్యాన్ చెప్పిందిదే
మొత్తంగా స్వీటీకి చాలా స్వీట్ మనస్తత్వం ఉందని, ఎవరిని నొప్పించదని ఎవరికైనా కష్టాలు వస్తే వారికి సహాయం చేసే గొప్ప గుణం ఆమెకు ఉందని మేకప్ మ్యాన్ ఆమె ఒరిజినల్ క్యారెక్టర్ ఎంత గొప్పదో చెప్పారు. ఆమె దగ్గర పనిచేసే ప్రతీ ఒక్కరిదీ అదృష్టంఅన్నారు.












Click it and Unblock the Notifications