ప్రభాస్‌ను అనుష్క ఏమని పిలుస్తుందో తెలుసా?
పాన్ ఇండియా రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ కల్కి చిత్రంతో సంచలన విజయం సాధించి రాజాసాబ్ చేస్తున్నారు. దీనితర్వాత స్పిరిట్ చిత్రం మొదలవుతుంది. వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తోన్న ప్రభాస్ పై ట్రేడ్ పండితులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలా వరుసగా సినిమాలు చేస్తేనే పరిశ్రమలోని అన్ని విభాగాలకు పని దొరుకుతుందని, థియేటర్లలో జనాల రద్దీ ఉంటుందంటున్నారు. కొన్ని సంవత్సరాలుగా సినీ ప్రియులతోపాటు ప్రభాస్ అభిమానులు కూడా డార్లింగ్ ఎప్పుడు పెళ్లిచేసుకుంటాడా? అని ఎదురు చూస్తున్నారు.
తాము మంచి స్నేహితులమే
వెండితెరపై ప్రభాస్-అనుష్క జంట బాగుండటంతోపాటు వీరిద్దరూ కలిసి చేసిన సినిమాల తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ అటువంటిదేమీలేదని, తామిద్దరం మంచి స్నేహితులమేనని ప్రభాస్ స్పష్టత ఇచ్చాడు. బిల్లా, మిర్చి, బాహుబలి1, బాహుబలి2 చిత్రాల్లో కలిసి నటించిన వీరిద్దరి కెమిస్ట్రీ మాత్రం సూపర్ అని చెప్పొచ్చు. బాహుబలి సినిమా షూటింగ్ జరిగే సమయంలో అనుష్క ప్రభాస్ ను బాగా ఏడిపించేది. విపరీతమైన టీజ్ చేసేది. ఆ సినిమాల్లో ఇద్దరూ తల్లీ కొడుకులుగా నటించిన సంగతి తెలిసిందే.

నా కొడుకు ఎక్కడ?
ప్రభాస్ కనపడకపోతే నా కొడుకు ఎక్కడ? నా బాబు ఎక్కడ? అని అడిగేది. ఇలా అడుగుతుండటం, టీజ్ చేస్తుండటంతో ప్రభాస్ తల పట్టుకున్నాడు. ఇలా సినిమా షూటింగ్ సమయంలో ప్రభాస్ ను ఏడిపించిన విషయాన్ని అనుష్క ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. బాహుబలి2లో మహేంద్ర బాహుబలిగా అనుష్కకు కొడుకుగా ప్రభాస్ కనిపించారు.
అయితే వీరిద్దరూ వివాహం చేసుకుంటారని ఎదురుచూస్తున్న అభిమానులు ఇటీవల వచ్చిన వార్తతో నిరాశకు గురయ్యారు. బెంగళూరుకు చెందిన ఓ వ్యాపారవేత్తతో అనుష్కకు ఆమె తల్లిదండ్రులు వివాహం కుదిర్చినట్లు వార్తలు వచ్చాయి. త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటన వస్తుందని, నిశ్చితార్థం, వివాహం తేదీని ప్రకటిస్తారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications