ఆమెతో రిలేషనే AR రెహమాన్‌ కొంపముంచిందా...?

స్టార్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ భార్య సైరా బాను తన భర్త నుంచి విడిపోతున్నట్లు ప్రకటించారు.మంగళవారం రాత్రి, ఆమె ఏఆర్ రెహమాన్ నుండి విడిపోతున్నట్లు ధృవీకరిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. తమ మధ్య సయోధ్య చేయలేని దూరం పెరిగిపోయిందని, అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నానని సైరా బాను తన ప్రకటనలో చెప్పుకొచ్చారు. ఏఆర్ రెహమాన్‌కు ఆయన భార్య విడాకులు ఇవ్వడంపై సినీ వర్గాలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాయి.

ఏఆర్ రెహమాన్ 1995లో సైరాను వివాహం చేసుకున్నారు. ఏ. ఆర్. రెహమాన్‌కి మొత్తం ముగ్గురు పిల్లలు. రెహమాన్‌ గారి పెద్ద కూతురు. ఆమె కూడా సంగీత రంగంలోకి అడుగు పెట్టింది.రెహమాన్‌ గారి రెండవ కూతురు. ఆమె కీబోర్డ్ వాయిస్తుంది.రెహమాన్‌ గారి కుమారుడు. ఆయన కూడా సంగీత రంగంలో చురుగ్గా ఉంటారు. 29ఏళ్ల పాటు సాగిన వారి వివాహ బంధం విడాకులతో ముగిసినట్టు అయింది. ఇదిలా ఉంటే తాజాగా ఏఆర్ రెహమాన్ టీంలోని ఓ మహిళ సైతం తన భర్తకు విడాకులు ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

AR Rahman team member Mohini Dey announces separation from her husband

ఏఆర్ రెహమాన్ టీమ్‌ మెంబర్ మోహిని భర్తకు విడాకులు ఇచ్చినట్లు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది. ''ప్రియమైన స్నేహితులు, కుటుంబ సభ్యులు, అభిమానులు, అనుచరులకు ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. భారమైన హృదయంతో, భర్త మార్క్ నేను విడిపోయామని ప్రకటిస్తున్నాను. మా ఇద్దరి పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నాము.అంటూ తన సోషల్ మీడియా పోస్టులో రాసుకొచ్చింది.

అయితే ఏఆర్ రెహమాన్ విడిపోతున్నట్లు ప్రకటించిన కొన్ని గంటల్లో మోహిని పోస్ట్ పెట్టడంతో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరి మధ్య రిలేషన్ ఉందనే ప్రచారం జరుగుతోంది. అందుకే గంటల తేడాతో విడాకులు ప్రకటించారని చర్చ జరుగుతోంది. మోహిని ఏఆర్ రెహమాన్‌తో కలిసి కొన్నేళ్లుగా పని చేస్తోందని తెలుస్తోంది. మరి ఈ ప్రచారంపై ఏఆర్ రెహమాన్, మోహిని ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+