నీ స్వార్థ రాజకీయాలకు ఎంతమంది బలి కావాలి.. విజయ్‌పై తెలుగు హీరోయిన్ సంచలన పోస్ట్
తమిళనాడు రాజకీయాల్లో సంచలనంగా మారిన తమిళగ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు దళపతి విజయ్ కరూర్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాట.. సినీ, సోషల్ మీడియా వర్గాల్లో పెద్ద దుమారాన్నే రేపుతోంది. సెప్టెంబర్ 27, శనివారం 'మీట్ ది పీపుల్' పేరుతో కరూర్‌లో జరిగిన ఈ భారీ ఈవెంట్‌లో విజయ్‌ను చూసేందుకు వచ్చిన అభిమానుల తాకిడికి గురై ఏకంగా 39 మంది మరణించగా, 60 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటనపై సినీ ప్రముఖులు, నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్న వేళ.. ఇద్దరు నటీమణుల పోస్ట్‌లు సోషల్ మీడియాలో ట్రోలింగ్ వార్‌కు దారితీశాయి.
ఓవియా సంచలన పోస్ట్: విజయ్‌ని అరెస్ట్ చేయాలి
హీరోయిన్ ఓవియా సింగ్ ఈ ఘటనపై చేసిన పోస్ట్ అత్యంత సంచలనం సృష్టించింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పేదల బతుకుల్లో విషాదం నింపిన విజయ్‌ని అరెస్ట్ చేయాలి అనే పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ కావడంతో, విజయ్ అభిమానులు ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ దారుణంగా ట్రోల్ చేశారు.

ఫ్యాన్స్ ఆగ్రహానికి భయపడిపోయిన ఓవియా వెంటనే ఆ పోస్ట్‌ను డిలీట్ చేసింది. అంతేకాకుండా, తనను తిడుతూ వచ్చిన స్క్రీన్‌షాట్లు షేర్ చేసి, ఒక కొటేషన్‌ను జతచేసింది. జీవితం జ్ఞానవంతులకు కలలాంటిది. మూర్ఖులకు ఆట... ధనవంతులకు కామెడీ, అదే పేదలకు మాత్రం విషాదం." దీంతో మరింత రెచ్చిపోయిన నెటిజన్లు, నువ్వు ఒక మూర్ఖురాలివి, మా హీరో కాదు అంటూ ఓవియాపై మండిపడుతున్నారు.
కాయదు లోహర్ పేరుతో ఫేక్ ట్వీట్
మరోవైపు, నటి కాయదు లోహర్ పేరుతో ఒక ఫేక్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ పోస్ట్‌లో.. తమిళనాడులో జరిగిన ప్రమాదంలో నా సన్నిహితులను కోల్పోయాను. విజయ్ ఇంకా ఎంత మందిని బలి తీసుకుంటావ్? నీ స్టార్ డమ్ కోసం ఎంతమంది చనిపోవాలి? ఇదంతా నీ స్వార్థ రాజకీయం వల్లే జరిగిందని రాసి ఉంది.
దీనిపై కాయదు లోహర్ వెంటనే స్పందించారు. నా పేరుతో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి తప్పుడు ట్వీట్లు చేస్తున్నారు. అదంతా అబద్ధం, దయచేసి నమ్మకండని తెలిపారు. కరూర్‌లో జరిగిన ఘటన తన మనసును కలిచివేసిందని, అయితే అక్కడ తనకు వ్యక్తిగత స్నేహితులు ఎవరూ లేరని ఆమె స్పష్టం చేశారు. బాధితులకు ఆమె ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మొత్తంగా, కరూర్ విషాదంపై వ్యక్తం చేసిన అభిప్రాయాలు, తప్పుడు ప్రచారాలు తమిళ రాజకీయ, సినీ వర్గాలలో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి.
-
Tamil Nadu Election Survey: పవన్ ఫీట్ రిపీట్ చేస్తున్న విజయ్ ? తేల్చేసిన తాజా సర్వే..! -
విజయ్ పై కక్షసాధింపు? -
హైదరాబాద్‌లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications