ఇంటర్వ్యూలో.. వర్జినా? ఎన్నిసార్లు?
టిక్ టాక్ ఉన్నరోజుల్లో అషురెడ్డి జూనియర్ సమంతగా పేరు తెచ్చుకుంది అలా.. బిగ్ బాస్ వరకు వెళ్ళింది. ఆ తర్వాత దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేత..... 'చెత్తపనులు' చేయించుకొని ఫేమస్ అయ్యింది. ప్రస్తుతం సినిమాలతోపాటు షోస్ చేస్తూ బిజీగా ఉంది. ఈమధ్యనే డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంది. ప్రస్తుతం దావత్ అనే షోను హోస్ట్ చేస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ షోలో స్టార్స్ ను ప్రశ్నలడిగి అలరిస్తుంది.
ఫస్ట్ హీరో సిద్దార్థ్ ను ఇంటర్వ్యూ చేసింది అషురెడ్డి. సిద్దు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క మాట గట్టిగా మాట్లాడినా అంతకు మించి సమాధానం చెబుతాడు. అషు, సిద్ధార్థ్ ల ఎపిసోడ్ కూడా ఎంతో వాడివేడిగా జరిగింది. తర్వాత అరియానా రెండు ఎపిసోడ్లు చేసింది. తాజాగా అషురెడ్డి మరో కొత్త ఎపిసోడ్ తో ముందుకు వచ్చింది. బేబీ సినిమాతో స్టార్ అయిన విరాజ్ అశ్విన్ తో ఈ షో చేసింది. బోల్డ్ ప్రశ్నలతో విరాజ్ ను ముంచెత్తింది.

ప్రేమ, రిలేషన్,.. ఇలా దేన్నీ వదలకుండా అడిగేసింది. తెలుగు షోస్ లో ఇలాంటి ప్రశ్నలు అడగరు. బాలీవుడ్ లో కాఫీ విత్ కరణ్ షో అంత బోల్డ్ గా ఉండవు. కానీ ఈ షో చూసేవారికి కరణ్ షోనే గుర్తుకొచ్చింది. అషురెడ్డి అందరిముందు విరాజ్ అశ్విన్ ను నువ్వు వర్జిన్ వా? అని అడుగుతుంది. అతను కాదు సమాధానం చెబుతారు. కాదు అని చెప్పగానే ఎన్నిసార్లు అని అడిగింది. ఇది మాత్రం కాస్తంత ఓవర్ గా అనిపించింది. అంతేకాదు.. ముద్దు సీన్లు.. ఎంతమందితో లాంటి ప్రశ్నలు అడిగింది. ఇది చూసినవారు ఎబ్బెట్టుగా ఉన్నాయంటున్నారు. ఈ షో ప్రోమో చూసాక.. అషూ... నువ్వు లేడీ కరణ్ జోహార్ కావాలనుకుంటున్నావా.. పాప? అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మొత్తం ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో చూడాలి.












Click it and Unblock the Notifications