మరో బాంబు పేల్చిన వేణు స్వామి

సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయ్యారు. సమంత, నాగచైతన్యలు వివాహిక జీవితం అంత సాఫీగా సాగదని ముందే చెప్పి సంచలనం సృష్టించారాయన. వేణు స్వామి చెప్పిన విధంగానే సమంత, నాగచైతన్య విడిపోయారు. ఆ తరువాత మెగా డాటర్ నిహారిక విడాకులు, రెబల్ స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ సినిమా ఫ్లాప్ గురించి ముందే చెప్పి సోషల్ మీడియాలో ఫుల్ పాపులారిటీని సంపాదించకున్నారాయన.

దీంతో సోషల్ మీడియాలో వేణు స్వామి జ్యోతిష్యానికి ఒక రేంజ్‌లో క్రేజ్ పెరిగింది. డింపుల్ హాయతి, రష్మిక, నిధి ఆగర్వాల్ వంటి హీరోయిన్లు వేణు స్వామి చేత జాతక దోష నివారణ పూజలు చేయించుకున్నారంటే ఆయన ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక రాజకీయ నాయకుల జాతకాలు గురించి ఆయన చెప్పినవి చెప్పినట్టుగానే జరుగుతున్నాయి.

 astologer venu swamy intresting comments goes viral

టీడీపీ అధినేత చంద్రబాబు 2023లో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటారని ముందే వేణు స్వామి చెప్పడం జరిగింది. ఆయన చెప్పినట్టుగానే చంద్రబాబు స్కిల్ స్కాంలో అరెస్టైయ్యారు. ఇక వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్ మరోసారి సీఎంలుగా ప్రమాణస్వీకారం చేస్తారని కుండబద్దలు కొట్టేశారు. తాజాగా తెలుగు ఇండస్ట్రీలో ఓ హీరో గురించి ఆయన చేసిన కామెంట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి.

తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని ఫ్యామిలీకి ప్రత్యేక గుర్తింపు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. నాగేశ్వరరావు, నాగార్జున ఇద్దరూ కూడా తమ సినిమాలతో అభిమానులను ఆకట్టుకున్నారు. అయితే అక్కినేని మూడోతరం మాత్రం అనుకున్నంతగా రాణించలేకపోతున్నారు. ముఖ్యంగా అక్కినేని అఖిల్‌కు ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ హిట్ దక్కలేదు. తాజాగా అఖిల్ కెరీర్ గురించి వేణు స్వామి ఓ బాంబు పేల్చారు.

 astologer venu swamy intresting comments goes viral

అఖిల్‌కు స్టార్‌డమ్ రాకపోవడానికి జాతక లోపమే అని వేణు స్వామి తేల్చిశారు. అఖిల్ జాతకం ఇప్పుడు అస్సలు బాగోలేదని ..ఈ విషయంలో నాగార్జున కలగజేసుకుని అఖిల్ జీవితాన్ని చక్కదిద్దాలని ఆయన కోరారు. తల్లి అమల మాటలు వినడం ఎప్పుడు మానేస్తాడో అప్పుడే అఖిల్ జీవితం బాగుంటుందని వేణు స్వామి తెలిపారు. నాగార్జున చెప్పిన విషయాలను అఖిల్ వింటే కెరీర్ బాగుంటుందని వేణు స్వామి చెప్పుకొచ్చారు. అఖిల్ గురించి వేణు స్వామి చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరి వేణు స్వామి చెప్పినట్టు చేస్తే అయిన అఖిల్ జాతకం మారుతుందేమో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+