Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Avatar Fire And Ash Review: థియేటర్లన్నీ అగ్నిపర్వతాలు.. స్క్రీన్లపై మంటలు..!

ప్రపంచంలోనే దిగ్గజ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్‌ తెరకెక్కించిన విజువల్‌ వండర్‌ అవతార్‌: ఫైర్‌ అండ్‌ యాష్‌.. ప్రీమియర్లు అమెరికాలో పడ్డాయి. మరికొద్ది గంటల్లో అంటే డిసెంబర్ 19 న ఇండియా వ్యాప్తంగా మూవీ రిలీజ్ కానుంది. అవతార్, అవతార్ 2 మాదిరిగానే ఈ మూవీకి కూడా భారీ కలెక్షన్లు రావచ్చని అంచనా. అవతార్​ మొదటి రెండు భాగాలు విశేష ఆదరణ పొందిన సంగతి తెలిసిందే. దీని కొనసాగింపుగా మూడో భాగం ఉండనుంది. ఇప్పటికే అమెరికాతో పాటు పలు దేశాల్లో ప్రీమియర్స్ పడగా.. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా అవతార్‌: ఫైర్‌ అండ్‌ యాష్‌ చిత్రంలో విజువల్స్ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయని టాక్ వినిపిస్తోంది. ఉత్కంఠ భరితంగా సాగే స్క్రీన్ ప్లే ఆడియన్స్ ను చూపుతిప్పుకోనివ్వదని తెలుస్తోంది. తాజాగా బాలీవుడ్ హంగామా ఈ సినిమాకు 3.5 స్టార్స్ ఇచ్చింది. ఇది విజువల్‌ గా అద్భుతమైన సినిమా అని, దీనిని బిగ్ స్క్రీన్ పైనే చూడాలని రాసుకొచ్చింది. పాండోర గ్రహం విజువల్స్, యాక్షన్ సీన్స్ లో వచ్చే విజువల్స్ వండర్ అనిపించేలా ఉంటాయని టాక్.

అవతార్ 2 లో మూవీ కథ హీరో జేక్ సల్లీ చెబుతున్నట్లుగా ఉంటుంది. అయితే అవతార్ 3 లో జేక్ కొడుకు లోక్ కథ చెబుతున్నట్లుగా ఉంటుంది. ఈ చిత్రంలో తొలిసారి మాంగ్ క్వాన్ అనే అగ్ని జాతి(యాష్ పీపుల్) తెగ ఎంట్రీ ఇవ్వనుంది. వీళ్లు అగ్నిపర్వాతాల్లో నివసిస్తుంటారు. వీరు చాలా దృఢంగా ఉంటారు. వీరితో హీరో ఎలా పోరాడబోతున్నాడు అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఇక ఈ చిత్రం ఏకంగా 3 గంటల 17 నిమిషాల రన్ టైంతో ఉంది. అంతసేపు ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడం అంటే కత్తిమీద సామే అని చెప్పొచ్చు. కానీ అవతార్ 2 కూడా ఇంచుమించు ఇదే రన్ టైమ్ ఉంటుంది.

అయితే పలు అంతర్జాతీయ రివ్యూ సంస్థలు అవతార్ 3 కు తక్కువ రేటింగ్ అండ్ రివ్యూస్ ఇచ్చాయి. రోటెన్ టమాటోస్ ఈ మూవీకి 69 శాతం మాత్రమే ఇచ్చింది. ఈ రేటింగ్ అవతార్, అవతార్ 2 కంటే తక్కువ. అయితే అవతార్ 2 కూడా మొదట నెగటివ్ రివ్యూస్ తోనే ప్రారంభం అయింది. కానీ ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 2 బిలియన్ డాలర్లతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.

Avatar Fire and Ash Wows Critics with Stunning Visuals and Epic Spectacle

ఇక 2009లో విడుదలైన అవతార్‌ మూవీ ప్రపంచ సినీ చరిత్రలో ఓ సంచలనంగా నిలిచింది. జేమ్స్‌ కామెరూన్‌ సృష్టించిన ఈ విజువల్‌ వండర్ కు యావత్ ప్రపంచం ఫిదా అయింది. ఆ తర్వాత అవతార్‌ ది వే ఆఫ్‌ వాటర్‌ చిత్రం రిలీజైంది. ఇది కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఈ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన మూడో చిత్రమే అవతార్‌: ఫైర్‌ అండ్‌ యాష్‌. అలాగే అవతార్‌ ఫ్రాంచైజీలోని నాలుగో భాగం అవతార్‌ 4 ను 2029 లో.. అలాగే ఐదో భాగం అవతార్‌ 5 ను 2031 డిసెంబరులో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే వెల్లడించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+