అల్లు అర్జున్ భార్యను అయ్యేదాన్ని - క్యూట్ బ్యూటీ
చిన్నారి పెళ్లికూతురు అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది " అవికా గోర్ ". హిందీ టెలివిజన్‌లో ప్రసారమైన Balika Vadhu సీరియల్ ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్‌గా అవికా దేశవ్యాప్తంగా భారీ పాపులారిటీ సంపాదించింది. చిన్న వయసులోనే తన సహజ నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ఆమె, తర్వాత హీరోయిన్‌గా సినిమాల్లో అడుగుపెట్టి తన కెరీర్‌ను విస్తరించింది.
తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా ఎంట్రీ..
తెలుగులో Uyyala Jampala సినిమాతో అవికా హీరోయిన్‌గా పరిచయమైంది. Raj Tarun సరసన నటించిన ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. తొలి సినిమాతోనే నెక్స్ట్ డోర్ గర్ల్ ఇమేజ్ సంపాదించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఉయ్యాల జంపాల విజయంతో అవికాకు వరుసగా అవకాశాలు వచ్చాయి. రాజ్ తరుణ్‌తో కలిసి చేసిన Cinema Choopistha Mava మరో విజయాన్ని అందించింది. అనంతరం Ekkadiki Pothavu Chinnavada, Raju Gari Gadhi 3 వంటి చిత్రాల్లో నటించి తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. అలాగే "లక్ష్మీ రావే మా ఇంటికి", "తను నేను", "బ్రోచేవారెవరురా" వంటి సినిమాల్లో కూడా విభిన్న పాత్రలు పోషించింది.

అయితే తెలుగులో ఆశించిన స్థాయి స్టార్‌డమ్ రాకపోవడంతో అవికా బాలీవుడ్ మరియు కన్నడ చిత్రాల్లో కూడా ప్రయత్నాలు చేసింది. కొన్ని టీవీ షోలు, వెబ్ సిరీస్‌లలో నటిస్తూ తన నటనను కొనసాగించింది. అయితే అక్కడ పెద్దగా బ్రేక్ రాకపోవడంతో సినిమాల సంఖ్య తగ్గింది. రీసెంట్ గానే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అల్లు అర్జున్ పై తనకు ఉన్న అభిమానాన్ని బయటపెట్టింది. ఖచ్చితంగా అల్లు అర్జున్ భార్యను అయ్యే దానిని అని.. ఎప్పుడూ డాన్స్ చేస్తూ ఉండేం వాళ్లం అంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఫుల్ వైరల్ గా మారాయి.
"I'll be a wife to #AlluArjun. I think we’ll keep dancing. That’s going to be the film about—we’ll just keep dancing. That’s my dream!"-#AvikaGor
— cinee worldd (@Cinee_Worldd) February 26, 2026
pic.twitter.com/gl943mmh5a
ఇక వ్యక్తిగత జీవితంలో అవికా తన బాయ్‌ఫ్రెండ్, మిలింద్ చంద్వానీతో ఐదారేళ్ల ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చుకుంది. సెప్టెంబర్ 30న ఒక రియాలిటీ షో వేదికగా ఈ జంట ఒక్కటై, తమ బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పింది. పెళ్లి చేసుకున్న వెంటనే, సాధారణంగా హీరోయిన్లు ఇండస్ట్రీకి దూరం అవుతారని లేదా కొంత కాలం బ్రేక్ తీసుకుంటారని అంతా భావించారు. పెళ్లి, హనీమూన్ అంటూ అవికా కూడా కొంత కాలం విరామం తీసుకుంటుందని నెటిజన్లు ఊహించారు. కానీ, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, అవికా గోర్ పెళ్లయిన నెల తిరక్కముందే తన కొత్త సినిమా షూటింగ్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం కెరీర్‌పై దృష్టి పెట్టడంతో పాటు వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ కొత్త దశలో ముందుకు సాగుతోంది.
సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్..
సినిమాలు తగ్గినా అవికా సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ గ్లామరస్, ట్రెడిషనల్ ఫోటోషూట్‌లను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది.
-
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..?












Click it and Unblock the Notifications