'నా అనుకున్న వాళ్లే నన్ను లైంగికంగా'.. ఓపెన్ అయిన స్టార్ హీరోయిన్
సినిమాల్లోకి వస్తున్నామంటేనే అన్నింటినీ భరించాలంటారు. ఒక్క రోజులో సక్సెస్ రాదు.. విమర్శలూ ఉంటాయి. పుకార్లనూ తట్టుకోవాలి. అలాగే లైంగిక వేధింపులు కూడా సినిమా ఇండస్ట్రీలో సహజంగానే వినిపిస్తుంటాయి. చిన్న ఆర్టిస్ట్ నుంచి స్టార్ హీరోయిన్ వరకు ప్రతి వాళ్లు తమ సినీ కెరీర్ లో ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ను చూసి ఉంటారు.
అన్నింటినీ దాటుకొని కెరీర్ లో సక్సెస్ పొందుతారు. ఈ జర్నీలో ఎన్నో విమర్శలు, పుకార్లు, క్యాస్టింగ్ కౌచ్ లాంటి భయానక అనుభవాలను దాటి రావాల్సి ఉంటుంది. ఈ జర్నీలో హీరోయిన్ కు ఎల్లకాలం వెన్నంటి ఉండేది వాళ్ల ఫ్యామిలీనే.. ఈ క్రమంలో నా అనుకున్న వాళ్లే నన్ను లైంగికంగా వేధించారని ఓ హీరోయిన్ పేర్కొంది. చేసింది కొన్ని సినిమాలే అయినా కుర్రాళ్ల హాట్ ఫేవరేట్ గా మారిపోయిందీ బ్యూటీ ఆమెనే అయేషా ఖాన్. హిందీ బిగ్ బాస్ ద్వారా పరిచయమైన ఈ అమ్మడు ముఖచిత్రం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.

ఆ తర్వాత శ్రీ విష్ణు హీరోగా నటించిన ఓం భీమ్ బుష్ అనే సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది. అనంతరం.. శర్వానంద్ నటించిన మనమే సినిమాలోనూ నటించింది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అయింది అయేషా ఖాన్. "చిన్నతనంలో మా నాన్న వాళ్ల ఫ్రెండ్ నా వక్షోజాలు బాగున్నాయని చెప్పాడు. చిన్నతనంలో ఉండటం వల్ల ఆయన చెప్పిన మాటలు నాకు అర్థం కాలేదు. ఆ వ్యక్తిని బాబాయ్ అని పిలిచేదాన్ని కానీ ఆయన మాత్రం చెడు దృష్టితో చూసేవాడు. ఓ సారి నన్ను చూసి కన్ను కొట్టి నీచంగా మాట్లాడాడు.. అని చెప్పుకొచ్చింది. ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.












Click it and Unblock the Notifications