కేజీఎఫ్ హీరో యష్, బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, కరీనా కపూర్ తో ఆ సినిమా !!

స్టార్ హీరోల సినిమాలో ఎప్పుడు హిట్ అవుతాయో, ఎప్పుడు ఫ్లాప్ అవుతాయో చెప్పలేము. అలాగే చిన్న సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయిన సందర్బాలు చాలానే ఉన్నాయి. అయితే స్యాండిల్ వుడ్ కు సినిమాలకు మాత్రమే పరిమితం అయిన హీరో యష్ కేజీఎఫ్ అనే సినిమాలతో రాత్రిరాత్రి సూపర్ స్టార్ అయిపోయాడు. కేవలం కేజీఎఫ్ సినిమాల సిరీస్ యష్ స్టార్ డమ్ ను మార్చేసింది.

కేజీఎఫ్, కేజీఎఫ్ పార్ట్ 2 సినిమాలు భారీ విజయం తర్వాత యష్ అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొందాడు. కేజీఎఫ్ 2 ఘనవిజయం తర్వాత ఏడాదిన్నర సమయం తీసుకున్న యష్ టాక్సిక్ అనే సినిమాను ప్రకటించాడు. ట్యాక్సిక్ సినిమా 2025 ఏప్రిల్ 10వ తేదీ విడుదల అవుతుందని హీరో యష్ ఇప్పటికే ప్రకటించారు. టాక్సిక్ చిత్రానికి గీతు మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. కేజీఎఫ్ -2 భారీ కలెక్షలు వసూలు చెయ్యడంతో పెద్దపెద్ద దర్శకులు యష్ తో సినిమా చెయ్యడానికి ప్రయత్నించారు.

Bad Shah Shahrukh Khan of Bollywood is acting in the movie Taxi starring KGF hero Yash ?
భర్త గర్ల్ ఫ్రెండ్ ఇంట్లోకి చొరబడిన సమంత ఏం చేసింది ?, బంధువులు వదల్లేదు !

అయితే అందరి అంచనాలు తల్లకిందులు చేసిన హీరో యష్ చివరికి గీతు మోహన్ దాస్ కు అవకాశం ఇవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇలాంటి సమయంలో టాక్సిక్ గురించి ఒక కొత్త అప్ డేట్ వచ్చింది, ఇది నిజమైతే టాక్సిక్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డ్ సృష్టించడం ఖాయం అని సినీ విశ్లేషకులు అంటున్నారు. ట్యాక్సిక్ సినీమా నిర్మాతల సన్నిహితుల సమాచారం ప్రకారం సినిమా యూనిట్ సభ్యులు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ టాక్సిక్ చిత్రంలో ఒక ప్రధాన పాత్రను పోషించడానికి సంప్రదించారని తెలిసింది.

Bad Shah Shahrukh Khan of Bollywood is acting in the movie Taxi starring KGF hero Yash ?

టాక్సిక్ ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ అని ఇప్పటికే క్లూ ఇచ్చారు. ట్యాక్సిక్ చిత్ర బృందం షారుక్‌ ఖాన్ ను ఒక ప్రధాన పాత్రలో నటించాలని కోరిందని తెలిసింది. షారుక్ ఖాన్ దీనికి అంగీకరించాడా ? లేదా ? అనేది ఇంకా ఖచ్చితంగా తెలియనప్పటికీ ఈ వార్త వినడానికి హీరో యష్ అభిమానులు థ్రిల్ అవుతున్నారు. కేజీఎఫ్ సక్సెస్ తర్వాత యష్ బరువు పెంచి టాక్సిక్ సినిమా చేయడానికి అంగీకరించాడు. అంతగా పరిచయం లేని గీతు మోహన్ దాస్‌ని దర్శకురాలిగా ఎంచుకున్న యష్ అందరికి మరో సర్ ప్రైజ్ చేశాడు.

కేజీఎఫ్ సినిమా తరువాత పెద్ద పెద్ద దర్శకులను విడిచిపెట్టి మహిళా దర్శకురాలితో పనిచేయడానికి యష్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అందరికి ఆశ్చర్యం కలిగించింది, యష్‌కి స్క్రిప్ట్‌పై నమ్మకం ఉందని ఆయన సన్నిహితులు, స్యాండిల్ వుడ్ కు చెందిన కొందరు అంటున్నారు. ఈ సినిమాలో కరీనా కపూర్ కూడా నటిస్తోందని అంటున్నారు ట్యాక్సిక్ సినిమాలో కరీనా కపూర్ నటిస్తున్నారా అనే విషయంలో ట్యాక్సిక్ చిత్ర బృందం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.

వీటన్నింటి మధ్య, ఇప్పుడు కేజీఎఫ్ హీరో యష్, బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్‌తో కలిసి బిగ్ స్క్రీన్‌పై కనిపించనున్నారని వార్తలు వచ్చాయి. వరుస పరాజయాల తర్వాత, షారుఖ్ ఖాన్ 2023లో జవాన్, పఠాన్ సినిమాలతో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుని మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఒకే సినిమాలో కనిపిస్తే సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డు సృష్టించడం ఖాయమని యష్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Bad Shah Shahrukh Khan of Bollywood is acting in the movie Taxi starring KGF hero Yash ?

నేను ఎక్కడికీ వెళ్లడం లేదని, నేను ఇక్కడికే అందరినీ పిలుస్తానని యష్‌ కేజీఎఫ్ 2 సినిమా విడుదల అయిన తరువాత చెప్పాడు. అందుకు తగ్గట్టుగానే షారుఖ్‌ ఖాన్ ను కన్నడ సినిమాకి తీసుకురానున్నారని తెలిసింది, సౌత్ ఇండియన్ సినిమాలో షారూఖ్ కనిపిస్తాడనే క్యూరియాసిటీ పెరిగింది. మొత్తం మీద ట్యాక్సిక్ సినిమాలో షారుఖ్ ఖాన్, కరీనా కపూర్ లు నటించే విషయంలో ఆ సినిమా యూనిట్ ఈ విషయంలో త్వరలో ఓ క్లారిటీ ఇస్తోందని యష్ సన్నిహితులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+