పవన్ అయినా కానీ తగ్గేదేలే అంటున్న బాలయ్య..!
నందమూరి బాలకృష్ణ హీరోగా.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం "అఖండ 2". 'అఖండ' మూవీకి సీక్వెల్ గా ఈ చిత్రం రాబోతుండగా.. ఈ మూవీలో సంయుక్త హీరోయిన్ గా నటిస్తోంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ మూవీని నిర్మిస్తున్నారు. బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
దసరా కానుకగా సెప్టెంబర్ 25 న ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే వీరు కలిసి చేసిన సింహ, లెజెండ్, అఖండ చిత్రాలు భారీ హిట్స్ అందుకోగా.. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ యూట్యూబ్ లో దూసుకుపోతుంది. అఖండ చిత్రంతో స్పీకర్లు బద్దలు కొట్టిన తమన్.. ఈ మూవీతో కూడా మరోసారి మోత మోగించడం గ్యారంటీ అని భావిస్తున్నారు.

మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తాను కమిటైన సినిమాలు పూర్తి చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే హరిహర వీరమల్లు చిత్రం రిలీజ్ అవ్వగా.. త్వరలోనే " ఓజీ " మూవీతో రాబోతున్నారు. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తుండగా.. ప్రియాంక మోహనన్ హీరోయిన్ గా చేస్తోంది. అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాశ్ రాజ్, హరీశ్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ సహా పలువురు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో ఓ గ్యాంగ్‌స్టర్ జీవితాన్ని ఆధారంగా తీసుకుని ఈ మూవీ రూపొందుతున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీని దసరా కానుకగా సెప్టెంబర్ 25న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ రెండు సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుపుకుంటున్నాయి. రెండు సినిమాలు ఓకే రోజు రే డేట్ అనౌన్స్ చేయడంతో.. అఖండ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని ప్రచారం నడుస్తోంది. ఈ సినిమా గ్రాఫిక్స్ వర్క్ లేట్ అయ్యే అవకాశం ఉండడం.. పవన్ కళ్యాణ్, బాలకృష్ణ ఒకే కూటమిలో ఉండడంతో.. ఒకరికోసం మరొకరు సినిమా త్యాగం చేసుకోవచ్చు అని భావిస్తున్నారు.
కాగా గ్రాఫిక్స్ వర్క్ విషయంలో ఎలాంటి ఆలస్యం జరగదని.. ఎట్టి పరిస్థితుల్లో చెప్పిన డేట్‌కే సినిమా రిలీజ్ చేయాలని బాలకృష్ణ సహా బోయపాటి పట్టుదలగా ఉన్నారట. ఒకవేళ ఓజీ సినిమా నిర్మాతలు వెనక్కి వెళ్లమని అడిగితే అప్పుడు ఆలోచిస్తారేమో తెలియదు, కానీ ప్రస్తుతానికి మాత్రం చెప్పిన డేట్‌కి రావాలని ఫిక్స్ అయ్యారని సినీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.












Click it and Unblock the Notifications