జూనియర్ ఎన్టీఆర్ పేరు బాలయ్యకు నచ్చదా?

నందమూరి తారకరామారావు అన్న పేరు వింటేనే ఆయన అభిమానుల రోమాలు నిక్కబొడుచుకుంటాయి. తెలియని వైబ్రేషన్ శరీరంలో ప్రవహిస్తుంది. అజరామరమైన చిత్రాలను తెలుగువారికి అందించిన తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి, పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల సమయంలోనే అధికారంలోకి తీసుకురాగలిగారు. అంతటి ఘనమైన చరిత్ర ఉన్న తారకరామారావు పేరును నందమూరి కుటుంబ సభ్యులు తమ పిల్లలకు, మనవళ్లకు రామారావు అనే పేరు పెట్టుకున్నారు.

హరికృష్ణకు ఇద్దరు కొడుకులు. పెద్దకొడుకు జానకిరామ్ కాగా రెండో కొడుకు కల్యాణ్ రామ్. హరికృష్ణ కర్ణాటకకు చెందిన షాలినిని రెండో వివాహం చేసుకున్నారు. వీరికి పుట్టిన కుమారుడే జూనియర్ ఎన్టీఆర్. తనకు తారక్ రామ్ అని పేరు పెట్టారు. నాన్నకు ప్రేమతో సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్ లో పాల్గొన్న హరికృష్ణ ఎన్టీఆర్ కు ఆపేరు పెట్టడానికి గల కారణాన్ని తెలియజేశారు.

Balayya did not want his father NTR to name Tarak

ఒకరోజు నాన్నగారు నన్ను మూడోవాడు ఏం చేస్తున్నాడు? అని అడిగారు. చదువుకుంటున్నాడు అని చెప్పాను. ఒకసారి నా దగ్గరకు తీసుకురా అన్నారు. సరే అని తీసుకువెళ్లాను. ఏం పేరు పెట్టావు అని అడగ్గా తారక్ రామ్ అని పెట్టినట్లు చెప్పాను. లేదు హరికృష్ణా.. వీడు నా అంశతో పుట్టాడు. వీడికి నందమూరి తారకరామారావు అని పేరు పెట్టు అన్నారు. ఆ విధంగా పెద్ద ఎన్టీఆర్ తన పేరును తారక్ కు దానం చేశారు అని హరికృష్ణ చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరో అవడానికి కారణం పేరులో ఉన్న ఎన్టీఆర్ పదమేనని, ఆ పేరు ఉండటం అనేది బాలకృష్ణతోపాటు నందమూరి వర్గంలోని కొంతమందికి ఇష్టం లేదని గతంలో వార్తలు కూడా వచ్చాయి. తారక్ కు పోటీగానే తారకరత్నను తీసుకొచ్చారనే టాక్ కూడా ఉంది. ఏది ఏమైనప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ప్రస్తుతం పాన్ ఇండియా హీరో అయిపోయాడు. స్టార్ ఇమేజ్ వచ్చింది. తన సినిమాలు తాను చేసుకుంటున్నాడు. నందమూరి కుటుంబంలో తనను వ్యతిరేకించేవారికి దూరంగానే ఉంటున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+