తెలుగు సినీ పరిశ్రమలో ‘అఖండ2’తో బాలయ్య సంచలన రికార్డు
నందమూరి బాలకృష్ణ ఉన్నంత జోరుగా తెలుగు సినీ పరిశ్రమలో ఏ కథానాయకుడు లేడు. అగ్రహీరోల నుంచి కుర్ర హీరోల వరకు ఎవరూ బాలయ్య చేసినంత వేగంగా, బాలయ్య సాధించినన్ని హిట్లు ఎవరూ కొట్టలేకపోతున్నారు. దీనికి కారణం ఏమిటంటే.. నిర్మాతలను ఆదుకోవాలని, వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించాలనేది ఆయన ఆలోచన. కరోనా సమయంలో సినిమా విడుదల చేయడానికి ఏ హీరో ముందుకు రాని సమయంలో ఎంతో ధైర్యంతో, సాహసంతో అఖండ సినిమాను విడుదల చేశారు. విశేష ప్రేక్షకాదరణ పొందిన ఈ సినిమా నుంచి బాలయ్య వెనుతిరిగి చూడాల్సిన అవసరం రాలేదు.
కరోనా సమయంలో మొదలైన ప్రభంజనం
అఖండ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి, అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి, బాబీ దర్శకత్వంలో డాకూ మహారాజ్, తిరిగి బోయపాటి శీను దర్శకత్వంలో అఖండ2 తాండవం చేశారు. వరుసగా 5 హిట్లు కొట్టడంతోపాటు వరుసగా 5 సినిమాలద్వారా రూ.100 కోట్లు రాబట్టిన తొలి తెలుగు హీరోగా బాలయ్య సంచలన రికార్డును నెలకొల్పారు.

బాలయ్యకు సహచరులుగా ఉన్న అగ్రహీరోలు చిరంజీవి, వెంకటేష్, నాగార్జున కూడా ఈ రికార్డును నెలకొల్పలేకపోయారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, రవితేజ లాంటి హీరోలవల్ల కూడా కాలేదు. కేవలం బాలయ్య మాత్రమే వరుసగా 5 సినిమాలకు 100 కోట్లు కొల్లగొట్టి చరిత్రలో తనకంటూ ఒక పేజీని లిఖించుకున్నారు.
ఆ జోరు ఇప్పుడు తగ్గేది కాదు
ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న 111వ చిత్రం కూడా ప్రత్యేకంగా నిలవబోతోంది. ఈ సినిమా ఘనవిజయం సాధిస్తే వరుసగా డబుల్ హ్యాట్రిక్ సాధించిన తొలి హీరోగా మరో సంచలన రికార్డు బాలయ్య సొంతమవుతుంది. అయితే అందుకు కొంత సమయం పడుతోంది. అభిమానులు కూడా వేచిచూడాలి. అఖండ2 మిశ్రమ స్పందన అందుకున్నప్పటికీ 100 కోట్లు సాధించింది. బ్రేక్ ఈవెన్ కోసం ప్రయత్నిస్తోంది. ఈ మూడు రోజుల్లో వచ్చే కలెక్షన్లతో బ్రేక్ ఈవెన్ అవుతుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. బాలయ్య జోరు ఇప్పట్లో తగ్గేది కాదని సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications