పీకుతా అని చెప్పాల్సిన పనిలేదు.. ఆ నిర్మాతకు బండ్ల గణేష్ కౌంటర్ !!
తెలుగు ప్రేక్షకులకు ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి పరిచయం అవసరం లేదు. కమెడియన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈయన.. పలు సినిమాల్లో నటించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక రవితేజ నటించిన ఆంజనేయులు మూవీతో నిర్మాతగా మారాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో కూడా సినిమాలు నిర్మించి ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నారు. బండ్ల గణేష్ గత కొంతకాలంగా సినిమాలకు, రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ వాటి గురించి సామాజిక మాద్యమాల్లో స్పందిస్తూనే ఉంటున్నారు. అయితే ఇప్పుడు బండ్ల గణేష్ లేటెస్ట్ గా చేసిన ట్వీట్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
బండ్ల గణేష్.. తన X (ట్విట్టర్) అకౌంట్‌లో "అది పీకుతా, ఇది పీకుతా అని మనం చెప్పాల్సిన పని లేదు మాటలు మన చేతిలో ఉన్నా, ఆట ఎవరిదో జనాలు తీర్మానిస్తారు" అంటూ రాసుకొచ్చారు. అయితే ఈ పోస్ట్ ఎవరిని ఉద్దేశించి అని చర్చ నడుస్తోంది. కాగా ఇటీవలే టాలీవుడ్‌లో నిర్మాతల మధ్య అంతర్గతంగా ఇష్యూ నడుస్తుందని అంటున్నారు. కాగా గణేష్ గతంలో కూడా పలువురిపై పరోక్ష వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

ఇక మరోవైపు బన్నీ వాసు మిత్ర మండలి సినిమా ఈవెంట్ లో మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో అన్ని సినిమాలు ఆడాలని కోరుకొనే వాళ్లలో తాను ఒకడిని అని చెప్పారు. ఇక్కడ సినిమా బాగుంటే చూస్తారు.. లేకపోతే చూడరని.. డబ్బు పెట్టి ఓ సినిమాను ట్రోల్ చేస్తే నడవదు అనుకొంటే.. అది చిన్నపిల్లల మనస్తత్వం అన్నారు. తొక్కితే బన్నీ వాసు పడిపోతాడని అనుకొంటారేమో.. కానీ నా వెంట్రుక కూడా పీకలేరు. నా సంస్కారం ఎంతంటే.. వేరే చోట నుంచి వెంట్రుక పీకి ఇవ్వగలను. కానీ తలమీదనే ఎందుకు పీకుతున్నానంటే.. అది నా సంస్కారం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇప్పుడు బండ్ల గణేష్ చేసిన పోస్ట్ బన్నీ వాసు గురించే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
అంతకు ముందు బండ్ల గణేష్ 'లిటిల్ హార్ట్స్' సినిమా సక్సెస్ మీట్‌కి హాజరయ్యారు. హీరో మౌళి తనూజ్‌ని ఉద్దశించి మాట్లాడుతూ... ఇప్పుడు నీ సినిమా హిట్ అయింది కాబట్టి అందరూ నీ చుట్టూ తిరుగుతున్నారు. ఇది అంతా తాత్కాలికం. ఇరవై రోజుల మాయ. మహేష్ బాబు ట్వీట్ చేశాడు, విజయ్ దేవరకొండ షర్ట్ ఇచ్చాడు అని ఆనందపడకు. ఇవన్నీ సక్సెస్ వలన వచ్చే సీన్‌లు" అంటూ చెప్పుకొచ్చారు.
అలానే అల్లు అరవింద్ గురించే మాట్లాడుతూ.. "ఇండస్ట్రీలో కష్టపడితేనే నిలబడగలం. ప్రతి ఒక్కరూ మెగాస్టార్ బావమరిదిలా, స్టార్ కమెడియన్ కొడుకులా, ఐకాన్ స్టార్ తండ్రిలా పుట్టలేరు. కొందరికే ఆ అదృష్టం దక్కుతుంది, కానీ మనలాంటి వారు కష్టపడినా క్రెడిట్ చివర్లో వాళ్లకే వెళ్లిపోతుంది" అని వ్యాఖ్యానించారు. ఆ చిత్రానికి డిస్ట్రిబ్యూటర్ గా బన్నీ వాసు వ్యవహరించారు.
“అది పీకుతా ఇది పీకుతా అని మనం చెప్పాల్సిన పని లేదు… మాటలు మన చేతిలో ఉన్నా, ఆట ఎవరిదో జనాలు తీర్మానిస్తారు……!
— BANDLA GANESH. (@ganeshbandla) October 16, 2025
ఇటీవల బన్నీ వాసు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బండ్ల గణేష్ వ్యాఖ్యలు నిజంగా షాకింగ్‌గా అనిపించాయి. అల్లు అరవింద్ గారు ఇండస్ట్రీ కోసం ఎంతో సేవ చేశారు. ఆయన గురించి అలా మాట్లాడటం బాధ కలిగించింది. దీంతో హ్యాపీ మూడ్ మొత్తం పోయింది అని అన్నారు. దీంతో బండ్ల గణేష్ ఇలా రియాక్ట్ అయ్యి ఉండవచ్చు అని అభిప్రాయపడుతున్నారు.
-
దెబ్బకు దిగొచ్చిన హరీష్ శంకర్ -
Mr work From Home : మీ టైటిల్‌కి.. మీ ప్రమోషన్లకి హ్యాట్సాఫ్ !! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ఎవరీ మార్క్ కె రాబిన్.. ఎందుకు ఆయనకు అంత క్రేజ్ -
అప్పుడు టీవి యాంకర్.. ఇప్పుడు ఏకంగా సినిమాకి రూ.20 కోట్లు !! -
మళ్లీ నోరు జారిన రాజేంద్రప్రసాద్.. ఏకంగా మాజీ సీఎంపై.. వీడియో -
45కి పైగా దేశాల్లో "దురంధర్ 2" నయా రికార్డ్.. పవన్ మూవీ సర్దేసుకోవడమే !! -
విజయ్- రష్మిక పెళ్లి వేళ 'అర్జున్ రెడ్డి' హీరోయిన్ పోస్ట్ వైరల్.. -
మరో హిట్ గ్యారంటీ .. కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న హీరో -
కోకాపేట్ అల్లు సినిమాస్ లాంచ్ తేదీ అనౌన్స్: ఆ సినిమాలతో బోణీ -
కెమెరా ముందే వాంతులు చేసుకున్న చిన్నారి పెళ్లికూతురు.. అసలేమైంది! వీడియో -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ పూర్తి.. వారు ఏమన్నారంటే?












Click it and Unblock the Notifications