Hema: నటి హేమకు బెయిల్ మంజూరు..
నటి హేమకు ఊరట లభించింది. కొద్ది రోజుల క్రితం హేమ బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్టయింది. బుధవారం స్థానిక కోర్టు హేమకు బెయిల్ మంజూరు చేసింది. ఆమె నుంచి డ్రగ్స్‌ను జప్తు చేసుకోలేదని, ఘటన జరిగిన పది రోజులకు వైద్య పరీక్షలు నిర్వహించారని హేమ తరఫు న్యాయవాది వాదించారు. డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు సాక్ష్యాలు అందించలేదన్నారు. ఆమె పార్టీలో పాల్గొన్నట్లు చూపే ఆధారాలను బెంగళూరు నేర నియంత్రణ దళం (సీసీబీ) న్యాయవాది కోర్టుకు అందజేశారు.
ప్రభుత్వం తరఫు న్యాయవాది మాత్రం హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు వాదించారు. అంతేకాకుండా మరికొంతమంది టాలీవుడ్ ప్రముఖులను ఈ పార్టీకి తరలించే ప్రయత్నం చేసినట్లు వాదించారు. విచారణకు హాజరు కావాలని నోటీసులు కూడా పంపించినట్లు గుర్తు చేశారు. అయినప్పటికీ అనారోగ్య కారణాలతో హేమ విచారణకు హాజరు కాలేదన్నారు. అందుకే పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు ఆమె బెయిల్ మంజూరు చేసింది.

అరెస్ట్ అయిన తర్వాత హేమను కోర్టులో హాజరుపర్చగా.. ఆమెకు 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. హేమకు జ్యుడిషియల్ కస్టడీ విధించడంతో తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా హేమ సభ్యత్వాన్ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. రేపు పార్టీలో దొరికిన హేమ అనేక నాటకాలు ఆడిన సంగతి తెలిసింది.
బెంగళూరు ఫామ్ హౌస్ లోనే ఉన్న హేమ తాను హైదరాబాద్ లో ఉన్నట్లు వీడియో విడుదల చేసింది. కానీ ఆ తర్వాత పోలీసుల క్లారిటీతో ఆమె పార్టీలో పాల్గొన్నట్లు తెలిసింది. ఆ తర్వాత ఆమె బిర్యానీ చేస్తున్న వీడియో కూడా విడుదల చేసింది.












Click it and Unblock the Notifications