Bigg Boss లో శివాజీ సర్ ప్రైజ్ ఎంట్రీ: ఇది ఆట కాదు.. వేట

బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్‌ 10 ప్రేక్షకులను పలకరించింది. కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ ప్రతిష్టాత్మక 10వ సీజన్ ఈ సాయంత్రం 7 గంటలకు లాంచ్ అయింది. 10వ సీజన్ కావడంతో ఈ సారి డిఫరెంట్ గా దశావతారం థీమ్‌తో షోను మరింత ఉత్కంఠభరితంగా రూపొందించారు. ఇందులో పాల్గొనే కంటెస్టెంట్లు ఎవరనే ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది.

ప్రేక్షకుల ఆదరణ పొందిన దేబ్జానీ మోదక్.. బిగ్ బాస్ హౌస్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఎన్నెన్నో జన్మల బంధం, సత్యభామ వంటి సూపర్ హిట్ సీరియల్స్‌తో తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిన ఈ బెంగాలీ బ్యూటీ తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె తర్వాత యువ కథానాయకుడు త్రిగుణ్ ఎంటర్ అయ్యాడు. ఇటీవలే హార్రర్ మూవీ ఈషా, చెన్నై లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడీ హీరో.

Beauty Meets Bigg Vibes as Debjani Modak Takes the Stage in Bigg Boss telugu Season 10 with Sivaji

బిగ్ బాస్ సీజన్ 10 హౌస్ లోపల జరిగే పరిణామాలను విశ్లేషించే బిగ్ బాస్ బజ్ షో కూడా సిద్ధమైంది. ప్రముఖ నటుడు శివాజీ ఈ టాక్ షోకు హోస్ట్‌గా వ్యవహరించబోతోన్నాడు. హౌస్‌మేట్స్‌ను హాట్ సీట్‌లో కూర్చోబెట్టనున్నాడు. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను శివాజీ ప్రశ్నలు అడిగే ప్రోగ్రామ్ ఇది. అన్‌ఫిల్టర్డ్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించనున్నాడు. ఇది ఆట కాదు.. వేట అంటూ సాగే ఈ కార్యక్రమం ప్రేక్షకులలో సరికొత్త ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

ఈ బిగ్ బాస్ బజ్ టాక్ షో ఈ నెల 7 వ తేదీ నుంచి ప్రతిరోజూ ఉదయం 10 గంటలు, సాయంత్రం 6 గంటలకు స్టార్ మా మ్యూజిక్ ఛానల్‌లో ప్రసారం కానుంది. ఇదివరకటి కంటే ఈ సారి డ్రామా, టాస్కులు మరింత రసవత్తరంగా ఉండబోతున్నాయని భావిస్తోన్నందున.. బుల్లితెర వీక్షకులలో ఈ సరికొత్త సీజన్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+