'విజయ్'తో పెళ్లికి ముందే "రష్మిక"కు బిగ్ షాక్.. ఆ ఒక్క కండిషన్ !
యంగ్ హీరో విజయ్ దేవరకొండ.. స్టార్ బ్యూటీ రష్మిక మందన్నల పెళ్లి వేడుకల సందడి మొదలైంది. ఎంతో కాలంగా సీక్రెట్ గా ఉంచిన వీళ్ల లవ్ స్టోరీ.. ఇప్పుడు పెళ్లి వేడుకతో ఒకటి కానుంది. ఈ మధుర క్షణాల కోసం అభిమానులు ఎదురుచూస్తూ వస్తున్నారు. మొత్తానికి ఫిబ్రవరి 26న విజయ్ - రష్మికల (విరోష్) వివాహం రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో అట్టహాసంగా జరుగుతోంది.
ప్రఖ్యాత ITC మెమెంటోస్ రిసార్ట్, సరస్సుల మధ్య ఉన్న ఈ రాజభవనంలో వేడుకలు జరుగుతున్నాయి. ఈ స్టార్ కపుల్ వివాహ వేడుకలు ఈరోజు (ఫిబ్రవరి 24) మెహందీ వేడుకతో సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య ప్రైవేట్‌గా పెళ్లి నిర్వహించాలని ఈ జంట నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకే వేదిక వద్దకి ఫోన్లు, కెమెరాలను అనుమతించడం లేదు.

ఈ క్రమంలోనే రేపు (ఫిబ్రవరి 25) హల్దీ, సంగీత్ కార్యక్రమాలు జరగనున్నాయి. 26న జరిగే వివాహానికి కేవలం 200 మంది అతిథులను మాత్రమే ఆహ్వానించారని, రెండు కుటుంబాల నుంచి చెరో 100 మంది హాజరవుతున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకల కోసం డచ్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన పూలతో ప్యాలెస్‌ను అలంకరించనున్నారని, ప్రముఖ డిజైనర్లతో వెడ్డింగ్ అవుట్‌ఫిట్స్ రూపొందిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ తర్వాత మార్చి 4న హైదరాబాద్‌లో సినీ ప్రముఖులు, స్నేహితుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. అయితే ఇప్పుడు పెళ్లికి ముందు రష్మికకు విజయ్ ఫ్యామిలీ ఒక కండిషన్ పెట్టినట్టు నెట్టింట జోరుగా చర్చ నడుస్తోంది.
విజయ్ తల్లిదండ్రులు గోవర్ధన్ రావు, మాధవి గతంలో కోడలి గురించి మాట్లాడిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2018లో "గీత గోవిందం" సక్సెస్ మీట్‌లో యాంకర్ సుమ, విజయ్ వివాహం గురించి తల్లిదండ్రులను ప్రస్తావించారు. రష్మిక కూడా నటించిన ఆ చిత్రంలో, మాధవిని కోడలి గురించి అడిగినప్పుడు ఆమె ఒకే షరతుని తెలిపారు. "బాబుని మంచిగా చూసుకునే కోడలు వస్తే చాలు. నిస్సందేహంగా అతనిని ప్రేమించాలి, అంతే. అతను చిత్ర పరిశ్రమలో ఉన్నందున అతనిని అర్థం చేసుకోవాలి," అని మాధవి స్పష్టం చేశారు.
అలానే గోవర్ధన్ రావు భార్య మాటలతో ఏకీభవిస్తూ, "నా కొడుకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే చాలు. నాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. కులం, మతంపై కూడా ఎలాంటి అంచనాలు లేవు," అన్నారు. "ఇండియన్‌ను, ముఖ్యంగా దక్షిణాది అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నాకు సంతోషంగా ఉంటుంది," అని తెలిపారు. మొత్తానికి ఇప్పుడు ఈ పెళ్లి వ్యవహారం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications