Pallavi Prashanth: బయటపడ్డ పల్లవి ప్రశాంత్ ఘరానా మోసం..?

ఓ సామాన్య రైతుగా జీవనాన్ని కొనసాగించిన పల్లవి ప్రశాంత్.. తరువాత యూట్యూబ్‌లో వీడియోలు చేస్తూ ఫేమస్ అయ్యాడు.బిగ్‌బాస్‌లోకి వెళ్లాలనే తన కోరికను సాకారం చేసుకుని టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయాడు. సామాన్య వ్యక్తిగా హౌస్‌లోకి అడుగుపెట్టిన ప్రశాంత్ ..తన ఆటతో అందరిని ఆకట్టుకుంటున్నాడు. ఈ సీజన్‌లో మొదటి కెప్టెన్ అయి తోటి కంటెస్ట్‌లకు షాకిచ్చాడు.

రోజు రోజుకు తన ఆటను మెరుగుపరుచుకుంటూ ప్రశాంత్ సెలబ్రిటీలకు సైతం షాకిస్తున్నాడు.హౌస్‌లో అడుగుపెట్టినప్పుడు ప్రశాంత్‌కు , ప్రస్తుతం ప్రశాంత్‌కు చాలా తేడా కనిపిస్తుంది. మొదట్లో అమ్మాయిలతో మాట్లాడానికి ఎక్కువుగా ఇష్టపడేవాడు. ముఖ్యంగా రతికతో పల్లవి ప్రశాంత్ వ్యవహారించిన తీరు చూసిన తరువాత.. మనోడు ఎక్కువ కాలం హౌస్‌లో ఉండడని అందరూ భావించారు.

bigg boss 7 telugu contestant pallavi prashanth marriage news goes viral

కాని నాగార్జున ఇచ్చిన వార్నింగ్‌తో తన ఆటతీరును మార్చుకుని 7వ సీజన్‌లో మొదటి కెప్టెన్‌గా ఎంపికై సంచలనం సృష్టించాడు. ఒకనొక సమయంలో పల్లవి ప్రశాంత్‌ షో మధ్య నుంచే బయటకు వస్తున్నారని ప్రచారం జరిగింది.గేమ్ ఆడే సమయంలో పల్లవి ప్రశాంత్ తలకు గాయం అయింది. తలకు తీవ్రమైన గాయం కావడంతో పల్లవి ప్రశాంత్‌ను బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేస్తున్నారనే ప్రచారం జరిగింది.

bigg boss 7 telugu contestant pallavi prashanth marriage news goes viral

కాని గాయాన్ని తట్టుకుని మరి హౌస్‌లో తన గేమ్‌ను కొనసాగిస్తున్నాడు. తాజాగా పల్లవి ప్రశాంత్‌ పెళ్లికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. పల్లవి ప్రశాంత్‌కు ఇన్నాళ్లు పెళ్లి కాలేదని అనుకున్నారంతా. అయితే పల్లవి ప్రశాంత్‌‌కి గతంలోనే పెళ్లైందని తెలుస్తుంది. పల్లవి ప్రశాంత్‌ పెళ్లి ఫొటో ఒకటి బాగా వైరల్ అవుతుంది.

bigg boss 7 telugu contestant pallavi prashanth marriage news goes viral

పెళ్లి సమయంలో భార్యతో పల్లవి ప్రశాంత్ దిగిన ఫొటోలు బయటకు వచ్చాయి.పెళ్లి బట్టల్లో వధువు పక్కన మెరిసిపోతున్నారు. దీంతో ఒక్కసారిగా పల్లవి ప్రశాంత్ అభిమానులు షాక్ అవుతున్నారు. పల్లవి ప్రశాంత్‌కి పెళ్లి ఎప్పుడైందని..మరి ఈ విషయం ఇప్పటి వరకు ఎందుకు బయటకు చెప్పలేదని పలువురు వాపోతున్నారు.అయితే దీనిపై పల్లవి ప్రశాంత్ కుటుంబ సభ్యులు ఎవరూ స్పందించలేదు. ఫొటోలో ఉన్న అమ్మాయి కూడా దీనిపై ఇప్పటి వరకు బయటకు వచ్చి మాట్లాడింది లేదు. దాంతో ప్రశాంత్ పెళ్లి వార్తలో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+