Bigg Boss 9 : బిగ్ షాక్.. ఈ వారం టాప్ కంటెస్టెంట్ ఎలిమినేషన్
బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ అనగానే, హౌస్‌లో మొదటి నుంచీ అందరి హృదయాలను గెలుచుకున్న ఒక పేరు గుర్తుకు వస్తోంది... ఆయనే భరణి. ఆయన ఎంట్రీ ఇచ్చిన రోజు నుంచే యువ కంటెస్టెంట్లతో సమానంగా టాస్కుల్లో పాల్గొనడం, అందరితో మంచిగా ఉంటూ రేలంగి మావయ్యగా ఇమేజ్ సంపాదించుకున్నారు. హౌస్‌లోని ప్రతీ ఒక్కరూ ఆయన్ను తమ కుటుంబ సభ్యుడిలా భావించడం, నాన్న, అన్నయ్య అంటూ పిలవడం చూసి ప్రేక్షకులు కూడా మురిసిపోయారు.
అయితే, భరణికి ఆ బంధాలే ఇప్పుడు శాపంగా మారాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బంధాలకు ఇచ్చిన విలువ, మాట కోసం తన ఆటను పక్కన పెట్టడం... ఈ పరిణామాలన్నీ ఆయన గ్రాఫ్‌ను దారుణంగా పడేసాయి. ఫలితంగా, టాప్ 5లో కచ్చితంగా ఉంటాడని అనుకున్న భరణి, ఇప్పుడు ఎలిమినేషన్ గండంలో చిక్కుకొని హౌస్‌ను వీడాల్సి వచ్చింది.

కొన్ని వారాల క్రితం వరకూ, భరణి తాను హౌస్‌లో అందరికంటే టాప్‌లో ఉన్నానని, తనను టార్గెట్ చేసినవారు ఆటోమేటిక్‌గా ఎలిమినేట్ అవుతున్నారని బలంగా నమ్మేవారు. కానీ, ఈ వారం హౌస్‌లో అందరికంటే ఆయనకే తక్కువ ఓటింగ్ వచ్చింది. దీంతో ఈ వారం ఆయన హౌస్ నుంచి బయటకు వచ్చేశారు.
బంధాల కోసం వ్యూహాలను, కంటెంట్‌ను పక్కన పెట్టడం,తగ్గిన కంటెంట్, టాస్కుల్లో వైఫల్యం, ఈ వారం ఆయన నుంచి ఎమోషన్స్ తప్ప, చెప్పుకోదగిన కంటెంట్ రాలేదు. టాస్కుల్లో కూడా పెద్దగా విజయం సాధించలేకపోయారు. గత వారం ఆడియన్స్‌తో ఇంటరాక్షన్ సమయంలో, ఆయన గేమ్ నచ్చడం లేదని, ఎలిమినేట్ చేయాలని ఉందని నేరుగా విమర్శలు ఎదుర్కొన్నారు.
ఈ విమర్శలు, తన ఆటతీరుపై వచ్చిన అభిప్రాయాలను నెమ్మదిగా అర్థం చేసుకున్న భరణిలో భయం మొదలైంది. దీనికి నిదర్శనంగా నిన్నటి లైవ్ ఎపిసోడ్‌లో, ఆయన ఇమ్మానుయేల్ వద్దకు వెళ్లి నేను హౌస్‌లో అందరికంటే కష్టమైన స్థానంలో ఉన్నప్పుడు, నాకోసం నువ్వు నిలబడతావా? అని అడగడం ఆందోళనను స్పష్టం చేసింది.
చివరి నిమిషంలో డేంజర్ జోన్‌లో భరణి, రాము నిలబడ్డారు. బిగ్ బాస్ హౌస్ అనుబంధాలకు విలువ ఇవ్వదు, కేవలం ఆటకే పట్టం కడుతుంది అని మరోసారి రుజువు చేస్తూ... స్వల్ప ఓట్ల తేడాతో రాము సేవ్ అవ్వగా, భరణి ఎలిమినేట్ అయ్యారు.
ఆయన నమ్మిన బంధాలు, ఆయనపై పెట్టుకున్న అతి నమ్మకం.. రెండూ భరణిని బిగ్ బాస్ హౌస్ గేట్లు దాటించాయి. హౌస్ నుంచి ఆయన ఎలిమినేషన్, కంటెస్టెంట్లందరినీ భావోద్వేగానికి గురిచేసింది. అనుబంధాలకు విలువ ఇచ్చే వ్యక్తిగా ఆయన గుర్తుండిపోయినా, టాప్ 5 వరకు వెళ్లగలిగే కంటెస్టెంట్‌ను ప్రేక్షకులే బయటకు పంపించాల్సి రావడం ఈ వారం బిగ్ బాస్ సంచలనంగా మిగిలిపోయింది.












Click it and Unblock the Notifications