Bigg Boss 9 : బిగ్ బాస్‌లోకి అత్యాచార బాధితురాలు..!
ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న బిగ్ బాస్ 9 తెలుగు గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ రసవత్తరంగా సాగుతోంది. తొలి నాలుగు ఎంట్రీల తర్వాత ఐదో కంటెస్టెంట్‌గా డ్యాన్స్ మాస్టర్ శ్రేష్టి వర్మ అడుగుపెట్టారు. ఆమె రాకతో హౌస్‌లో మరింత సందడి మొదలైంది.
ఇప్పటికే, సెలబ్రిటీలు మరియు సామాన్యుల కలయికతో ఈ సీజన్ ఆసక్తికరంగా మారింది. మొదటగా, స్టైలిష్ ఎంట్రీతో నటి తనుజ అందరి దృష్టిని ఆకర్షించగా, ఆ తర్వాత నటి ఆశాశైనీ తన గ్లామర్‌తో షోకు మరింత హైప్ తీసుకొచ్చారు. వీరిద్దరి తర్వాత, 'అగ్ని పరీక్ష' ద్వారా ఎంపికైన సామాన్యుడు కళ్యాణ్ మూడో కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి ప్రవేశించారు.

నాలుగో ఎంట్రీగా జబర్దస్త్ నటుడు ఇమ్మాన్యుయేల్ తన పంచ్‌లు, చమత్కారాలతో నవ్వుల సందడి సృష్టించాడు. ఇప్పుడు ఐదో కంటెస్టెంట్‌గా వచ్చిన డ్యాన్స్ మాస్టర్ శ్రేష్టి వర్మ, తన అద్భుతమైన డ్యాన్స్ నైపుణ్యంతో హౌస్‌లో ఎలాంటి ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తారో చూడాలి.












Click it and Unblock the Notifications