Bigg Boss 9 : బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మాస్క్ మ్యాన్
ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న బిగ్ బాస్ 9 తెలుగు గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. తొలి ఐదు ఎంట్రీల తర్వాత, ఆరో కంటెస్టెంట్‌గా 'అగ్ని పరీక్ష' ద్వారా ఎంపికైన సామాన్యుడు మాస్క్ మ్యాన్ హరీష్ హౌస్‌లోకి అడుగుపెట్టారు.
ఈ సీజన్ ప్రారంభం నుంచే సెలబ్రిటీలు, సామాన్యుల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. మొదటి ఎంట్రీతోనే నటి తనుజ తన స్టైల్‌తో ఆకట్టుకోగా, ఆ తర్వాత ఆశాశైనీ తన గ్లామర్‌తో షోకు మరింత హైప్ తీసుకొచ్చారు. ఆ తర్వాత మూడో కంటెస్టెంట్‌గా సామాన్యుడు కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చారు.

నాల్గో ఎంట్రీగా జబర్దస్త్ నటుడు ఇమ్మాన్యుయేల్ తన పంచ్‌లు, చమత్కారాలతో నవ్వుల సందడి సృష్టించగా, ఐదో కంటెస్టెంట్‌గా డ్యాన్స్ మాస్టర్ శ్రేష్టి వర్మ తన అద్భుతమైన డ్యాన్స్ నైపుణ్యంతో ప్రేక్షకులను ఆకర్షించారు. ఇప్పుడు ఆరో కంటెస్టెంట్‌గా హరీష్ రాకతో సామాన్యుల బలం మరింత పెరిగింది.
మాస్క్ మ్యాన్గా పేరున్న హరీష్ తన ఆట తీరుతో ఎలాంటి ఆశ్చర్యాలు కలిగిస్తారో, హౌస్‌లో ఎలాంటి ఎమోషనల్ కంటెంట్‌ను అందిస్తారో చూడాలి. ఈ సీజన్‌లో సామాన్యులు, సెలబ్రిటీలు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటారో చూడటం ఆసక్తికరంగా ఉండబోతోంది.












Click it and Unblock the Notifications