Bigg Boss 9 : నాలుగో వారం హౌస్ నుంచి టాప్ కంటెస్టెంట్ ఎలిమినేషన్
'బిగ్ బాస్ 9 తెలుగు' ఆట రసవత్తరంగా మారింది. కేవలం మూడు వారాల్లోనే ముగ్గురు కామనర్స్ (శ్రేష్టి, మనీష్, ప్రియా శెట్టి) ఎలిమినేట్ కావడంతో, మిగిలిన హౌస్‌మేట్స్‌లో అలజడి మొదలైంది. జనాల నాడి అర్థం చేసుకున్న కంటెస్టెంట్స్, ముఖ్యంగా దమ్ము శ్రీజ, తన గేమ్‌ను మార్చుకుని మెరుపు వేగంతో దూసుకెళ్లగా, మాస్క్ మ్యాన్ హరీష్ మాత్రం అదే నిస్తేజంతో కొనసాగుతూ ఇప్పుడు పెను ప్రమాదంలో పడ్డారు.నాలుగో వారం నామినేషన్లలో డేంజర్ జోన్‌లో ఉన్న కంటెస్టెంట్‌లలో శ్రీజ కూడా ఉండేది. కానీ, ఒక్క రోజులో ఆమె గ్రాఫ్ అమాంతం పెరిగిపోవడం వెనుక ఉన్న కారణం-ఎమోషనల్ సపోర్ట్.
కెప్టెన్సీ టాస్క్‌లో తన అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్న పవన్ కళ్యాణ్ని రీతూ చౌదరి "వెన్నుపోటు" పొడిచి, పక్కకు తప్పించిన సందర్భం ప్రేక్షకులను కదిలించింది. ఆ సమయంలో, మిగిలిన వారంతా సైలెంట్‌గా ఉన్నా, దమ్ము శ్రీజ మాత్రం పవన్ కళ్యాణ్‌కు బలమైన అండగా నిలిచింది. కన్నీళ్లు పెట్టుకున్న పవన్‌ను ఓదార్చే ప్రయత్నం చేయడం, మొదటి నుంచి పవన్ కోసం ఆడటం... ఇవన్నీ అతని అభిమానులను తీవ్రంగా ఆకట్టుకున్నాయి.

ఫలితంగా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుంచి ఓట్లు ఒక్కసారిగా శ్రీజ వైపు మళ్లాయి.విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సపోర్ట్‌తో శ్రీజ ఏకంగా టాప్ 2 స్థానానికి చేరుకుంది. మొదటి స్థానంలో సంజన కొనసాగుతుండగా, రెండవ స్థానం శ్రీజది, మూడవ స్థానం రీతూ చౌదరిది కావడం గమనార్హం.
ఈ వారం ఓటింగ్ సరళిలో మరొక ఆసక్తికరమైన అంశం ఫ్లోరా షైనా వెనుకడుగు వేయడం. వాస్తవానికి, నిన్న మొన్నటి వరకు టాప్ 2లో ఉన్న ఫ్లోరా, ఈ వారం కూడా బాగానే ఆడింది. కానీ, ఓటింగ్ కీలకం అయ్యేటప్పటికి ఎమోషనల్ కనెక్షన్ మిస్ అయ్యింది.
నామినేషన్స్‌లో ఉన్న మిగిలిన కంటెస్టెంట్స్ (ముఖ్యంగా శ్రీజ) ఇచ్చిన ఎమోషనల్ కంటెంట్ ముందు, ఫ్లోరా బాగా వెనుకబడింది. అందుకే, ఆమె ఇప్పుడు ఐదవ స్థానంలోకి వచ్చింది. అయితే, ఆమెకు , చివరి స్థానంలో ఉన్న మాస్క్ మ్యాన్ హరీష్‌కు మధ్య ఉన్న ఓటింగ్ తేడా చాలా పెద్దదిగా ఉంది.
దీంతో నాలుగో వారం హౌస్ నుంచి మాస్క్ మ్యాన్ హరీష్ ఎలిమినేషన్ అయ్యారు. షో ప్రారంభం నుంచీ ఆటలో వేగం పెంచకపోవడం, హౌస్‌లో పెద్దగా కంటెంట్ ఇవ్వకపోవడం, ప్రేక్షకులతో కనెక్ట్ కాకపోవడం వంటి కారణాల వల్ల ఆయన ఓటింగ్ గ్రాఫ్‌లో మొదటి నుంచీ చివరి స్థానంలోనే ఉన్నారు. శ్రీజ వంటి కంటెస్టెంట్లు ఒక్క రోజు ఎపిసోడ్‌తో గ్రాఫ్‌ను పెంచుకోగా, హరీష్ తన ఆట తీరుని మార్చుకోవడానికి ఏడు రోజులు కూడా సరిపోలేదు.
దీంతో ఓటింగ్‌లో మాస్క్ మ్యాన్ హరీష్ వెనుకపడ్డాడు. అధికారికంగా మాస్క్ మ్యాన్ హరీష్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. మాస్క్ మ్యాన్ హరీష్ కన్నా ఓట్లు అధికంగా పోల్ కావడంతో ఫ్లోరా ఎలిమినేష్ నుంచి బయటపడ్డారు. మాస్క్ వెనుక ఉన్న మనిషి ఎవరు అనేది తెలుసుకోకముందే, ప్రేక్షకులకు ఆయన ఆట నచ్చకపోవడం గమనార్హం.












Click it and Unblock the Notifications