గుండె సంబంధిత సమస్యతో ఆసుపత్రిలో చేరిన బిగ్‌బాస్ నటి..!
గుండె సంబంధిత సమస్యతో బిగ్‌బాస్ నటి, ప్రముఖ డ్యాన్సర్ కమ్ యాక్ట్రెస్ రాఖీ సావంత్ ఆసుపత్రిలో చేరారు. ఈ న్యూస్ కాస్త ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈ విషయం తెలుసుకున్న ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బాలీవుడ్ లో నటిగా, డ్యాన్సర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాఖీ సావంత్ ప్రస్తుతం ఆసుపత్రి బెడ్‌పై కనిపిస్తోంది. ఈమె కేవలం బాలీవుడ్‌లోనే కాకుండా టాలీవుడ్‌లో కూడా పలు స్పెషల్ సాంగ్స్‌లో మెరిసింది. ఈ బ్యూటీ హిందీ బిగ్‌బాస్‌లో కూడా పాల్గొని, తనదైన ప్రదర్శనలతో అందరినీ అలరించింది. ఈ నటి ఎప్పడూ వివాదాలతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.

ప్రస్తుతం ఈ బ్యూటీ ఆసుపత్రిపై బెడ్‌పై పడుకుని ఉన్న ఫోటోలు కాస్త నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను హిందీ పాపరాజీ వైరల్ భయానీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. అందులో రాఖీ సావంత్ హాస్పిటల్ బెడ్ పై చేతికి సెలైన్ పెట్టుకుని కనిపిస్తోంది. దీంతో ఆమెకు ఏమైందా అంటూ ఆమె అభిమానులు, నెటిజన్లు, తెగ కంగారుపడుతున్నారు.
ఎలాంటి ప్రమాదం లేదన్న వైద్యులు..
అయితే, రాఖీసావంత్ గుండె సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో జాయిన్ అయ్యిందని బాలీవుడ్ మీడియాలో న్యూస్ వస్తున్నాయి. కానీ, ఆమె ఆరోగ్యం స్థిమితంగానే ఉందని, ఆమెకు ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు తెలిపినట్లు మరిన్ని కథనాలు వినిపిస్తున్నాయి. ఈ నటి బిగ్ బాస్ హౌస్‌లో చాలా ఫేమస్ అయ్యింది. ఈమె బిగ్‌బాస్ హోస్‌లో చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ప్రేక్షకులను తన కామెడీతో ఎంతో నవ్వించింది. ఈమె ఆరోగ్యం విషయం తెలుసుకున్న అభిమానులు కాస్త రాఖీ సావంత్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు.












Click it and Unblock the Notifications