ఒక్క రాత్రికి నా రేటు అంత ఫిక్స్ చేశారు.. సంచలన విషయాలను బయపెట్టిన నటి
ప్రతి ఇండస్ట్రీల్లోనూ మహిళలకు వేధింపులు తప్పడం లేదు. పని చేసే ప్రతిచోట అమ్మాయిలు అభద్రతా భావంతో ఉన్నారని ఇటీవల ఓ సర్వేలో తేలింది. ఇక సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని చాలామంది బహిరంగంగానే వెల్లడించారు. తమకు ఎదురైన లైంగిక వేధింపులు ,కాస్టింగ్ కౌచ్, కమింట్మెంట్‌ల గురించి హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇటీవల పలు సందర్భాల్లో వెల్లడిస్తున్నారు.
తాజాగా మరో బ్యూటీ లైంగిక వేధింపులకు గురయ్యారనే వార్త హాట్ టాపిక్‌గా మారింది. ఆ బ్యూటీ మరెవరో కాదు.. బిగ్ బాస్ ఫేం నైనిక. నైనిక ప్రస్థానం 'ఢీ' డ్యాన్స్ షోతో మొదలైంది. ఒక డ్యాన్సర్‌గా ఆమె తన అద్భుతమైన ప్రదర్శనలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 'ఢీ' షోలో ఆమె డ్యాన్స్ నైపుణ్యం, గ్రేస్ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఆ షోలో ఆమెను 'పొట్టి పిల్ల' అని అభిమానులు ముద్దుగా పిలుచుకునేవారు. డ్యాన్సర్‌గా ఆమె సంపాదించుకున్న గుర్తింపుతో నటన వైపు అడుగులు వేశారు. 'పిల్లా పడేసావే' వంటి టీవీ సీరియల్స్‌లో నటించి నటిగా కూడా ప్రశంసలు అందుకున్నారు.

డ్యాన్సర్, నటిగా సాధించిన ఫేమ్ నైనికకు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా ప్రవేశించే అవకాశాన్ని కల్పించింది. హౌస్‌లోకి అడుగుపెట్టిన తర్వాత ఆమె మొదట్లో చాలా ఎనర్జిటిక్‌గా, చురుగ్గా కనిపించారు. ముఖ్యంగా 'క్లాన్ లీడర్'గా ఆమె ఆడిన గేమ్ ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకుంది. అబ్బాయిలకు గట్టి పోటీ ఇచ్చే ఏకైక కంటెస్టెంట్‌గా ఆమె కనిపించారు. అయితే, కొన్ని వారాల తర్వాత ఆమె ఆటలో వేగం తగ్గిపోయింది. దీంతో ఆమె కొన్ని వారాలకే ఎలిమినేట్ అయ్యారు. బిగ్ బాస్ లో ఆమె ప్రయాణం తక్కువ కాలమే అయినా, ఆమె తనదైన ముద్ర వేశారు.
తాజాగా నైనిక జబర్దస్త్ వర్ష హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కిస్సిక్ టాక్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన జీవితంలో ఎదురైన ఘటనలన అభిమానులతో పంచుకున్నారు. ఒకర్ని గాఢంగా ప్రేమించానని అయితే అతను నన్ను మోసం చేశాడని తెలిపింది. ఆమె మాట్లాడుతూ.. నా కెరీర్‌లో కాస్టింగ్ కౌచ్‌ను కూడా ఫేస్ చేశానని చెప్పుకొచ్చింది. నాకు తెలిసిన వ్యక్తి ఫోన్ చేసి మీ ఫొటోలు అసభ్యకరంగా బయటకు వెళ్తున్నాయని, ఫొటోతో పాటు రేట్ కూడా ఫిక్స్ చేసి పెడుతున్నారని తెలిపారు. ఇది విని నేను షాక్ అయ్యానని , నా ప్రమేయం లేకండా ఇంత జరుగుతుందా అని ఆశ్చర్యపోయానని నైనిక వెల్లడించింది. ఇలాంటి వాళ్లు చిన్న పిల్లలను, కుక్కలను కూడా వదలరని నైనిక కాస్తా ఘాటుగానే మాట్లాడింది. ప్రస్తుతం నైనిక మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్‌గా మారాయి.
-
'జబర్దస్త్' యాంకర్ ఛాన్స్ వదులుకున్న నటి ఎవరో తెలుసా? అనసూయ స్థానంలో.. -
ఓటీటీలోనూ బ్లాక్ బస్టర్.. ఈ సినిమా చూసి ప్రభాస్ ఫిదా..!! -
రెండు ఎలక్ట్రిక్ స్టవ్ లు కొన్నా.. గ్యాస్ కొరత వేళ సూపర్ స్టార్ సంచలనం -
'బెడ్ రూమ్ లో నా భర్త చేసేది ఇదీ'.. రాజ్ నిడిమోరుపై సమంత వైరల్ పోస్ట్.. -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
Tollywood: డబ్బులు ఇవ్వకుండా పారిపోయిన నిర్మాత -
హీరోయిన్ కు పవన్ కల్యాణ్ రాజకీయ ఆఫర్.. ఏం జరిగిందంటే..? -
టాలీవుడ్ హీరోకు షాక్ .. 'పెళ్లయిన 3 రోజులకే భార్య వదిలేసి వెళ్లిపోయింది'..! -
సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని.. 40 ఏళ్ల వ్యక్తిని 20 ఏళ్ల అమ్మాయి ప్రేమిస్తే ?? -
తెలుగు ప్రేక్షకులు ఎడ్లబండ్లు కట్టుకొని వెళ్లి మరీ చూసిన సినిమాలు ఇవే -
ఎన్టీఆర్ డైరెక్షన్లో చిరంజీవి నటించిన ఏకైక సినిమా -
అల్లు అర్జున్‌కు ఒక్క హైదరాబాద్‌లోనే ఎన్ని లగ్జరీ ప్రాపర్టీస్ ఉన్నాయో తెలుసా?











Click it and Unblock the Notifications