ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇచ్చిన అవకాశాలు ఇవ్వరు ..బిగ్‌బాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్
సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని చాలామంది బహిరంగంగానే వెల్లడించారు. తమకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ గురించి హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు పలు సందర్భాల్లో బయటపెట్టడం జరిగింది.గతంతో పోలిస్తే ఇటీవల నటులు తమకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి ధైర్యంగా చెబుతున్నారు.
తాజాగా బిగ్‌బాస్ బ్యూటీ హిమజ ఇండస్ట్రీలో జరిగే కాస్టింగ్ కౌచ్, కమిట్మెంట్ గురించి స్పందించారు. హిమజ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు పెద్దగా అవకాశాలు రావడం లేదని తెలిపారు. తెలుగు అమ్మాయిలు రిజర్వ్‌డ్‌గా ఉంటారని కొందరు అభిప్రాయపడుతున్నారని..కానీ ఇది తప్పని ఇప్పటికే రుజువైందని హిమజ ఈ ఇంటర్య్వూలో పేర్కొన్నారు. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే కమిట్మెంట్ ఇస్తేనే ఆఫర్లు వస్తాయనేది ఓ రూమర్ మాత్రమే అని హిమజ తెలిపింది.

కమిట్మెంట్ ఇచ్చిన వాళ్లందరికీ ఆఫర్స్ రావడం లేదు.. అలాగే అవకాశాలు వచ్చిన వారందరూ కమిట్మెంట్ ఇచ్చినట్టు కాదని హిమజ చెప్పుకొచ్చారు. చాలామంది తెలుగు అమ్మాయిలకు అవకాశాలు వస్తున్నాయి.కానీ ఆ అవకాశాలను వినియోగించుకోవడంలో మనవాళ్లు ఫెయిల్ అవుతున్నారని హిమజ తెలిపారు. కొందరు అత్యాశ కారణంగా అవకాశాలను వదులుకుంటున్నారని హిమజ చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్, కమిట్మెంట్‌పై బిగ్‌బాస్ నటి హిమజ చేసి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
-
దర్శకుడు రాజమౌళి ఇంటి కోడలు కాబోతున్న తెలుగు హీరోయిన్..! -
రాజేంద్ర ప్రసాద్‌కి హీరో విశాల్ వార్నింగ్.. క్షమాపణ చెప్పాల్సిందే !! -
హన్సిక భర్తకి అంతకు ముందే పెళ్లి జరిగిందని తెలుసా.. బెస్ట్ ఫ్రెండ్ తోనే !! -
ఊపిరి ఆపేసే గ్లింప్స్ వచ్చేసింది.. వణికిస్తున్న హారర్ థ్రిల్లర్..! -
లారీ ఎక్కి వెళ్లి కృష్ణ సినిమాలు చూసేవాడిని: సీఎం రేవంత్ -
ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటివరకు రాని కథతో సినిమా..! -
అప్పుడు టీవి యాంకర్.. ఇప్పుడు ఏకంగా సినిమాకి రూ.20 కోట్లు !! -
‘పుష్ప2’, ‘ధురంధర్’ సినిమాల్లో అసలైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
మెగాస్టార్ చిరంజీవి మాతృమూర్తి "అంజనా దేవి"కి స్పెషల్ అవార్డు..! -
విడాకులు తీసుకున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. 4 ఏళ్లకే! -
దెబ్బకు దిగొచ్చిన హరీష్ శంకర్ -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ పూర్తి.. వారు ఏమన్నారంటే?











Click it and Unblock the Notifications