బిగ్‌బాస్‌లో రచ్చ.. పచ్చి బూతులతో రెచ్చిపోయిన అమ్మాయిలు
తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ 8వ సీజన్ ఘనంగా తన మొదటి వారాన్ని పూర్తి చేసుకుంది. ఈసారి ప్రోమోలతోనే అదరగొట్టిన బిగ్‌బాస్ , దానికి మించిన కంటెంట్‌తో ఆకట్టుకుంటారని అంతా భావించారు.అయితే ఈ సీజన్‌లో పెద్దగా పేరున్న ఆర్టిస్టులు లేకపోవడంతో షో యామమాన్యంపై అభిమానులు పెదవి విరుస్తున్నారు.మరోవైపు కంటెస్టెంట్లు సైతం మొదటివారంలో పెద్దగా ఆకట్టుకున్నట్టు కనిపించలేదు. తొలి రోజు నుంచే హౌస్ మేట్స్ తమ స్టేటజీలతో గేమ్‌ను స్టార్ట్ చేశారు. రెండో రోజు నుంచే కంటెస్టెంట్ల మధ్య గొడవలు మొదలయ్యాయి.అయితే ఈ గొడవలు చూడటానికి కొంచెం అతిగా అనిపించాయి.
వంట దగ్గర నుంచి హోస్ శుభ్రంగా ఉంచుకోవడం, బాత్ రూమ్స్ నీట్‌గా లేకపోవడం అంశాలపై హౌస్‌మెట్స్ మధ్య గొడవలు జరిగాయి. ఇక తొలివారం ఎలిమినేషన్‌లో భాగంగా బెజవాడ బేబక్క హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. హౌస్‌లో ఆమె ఓవర్ యాక్షన్ చేసిందని మెజార్టీ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దీని కారణంగానే ఆమెకు ఓట్లు తక్కువ పడ్డాయని తెలుస్తోంది. దీంతో ఈ సీజన్‌లో బయటకు వచ్చిన తొలి కంటెస్టెంట్‌గా బెజవాడ బేబక్క నిలిచారు. ఇక సెకండ్ వీక్ నామినేషన్స్ వాడివేడిగా జరిగాయి. నామినేషన్స్ సమయంలో కంటెస్టెంట్ల మధ్య పెద్ద యుద్దమే నడించింది.

కారణాలు చెప్పి ప్రతి కంటెస్టెంట్ ఇద్దరు కంటెస్టెంట్స్ ని నామినేట్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించాడు. నామినేట్ చేసిన కంటెస్టెంట్ పై రంగు నీళ్లు పోయాల్సి ఉంటుంది. సీతతో ప్రేరణ, సోనియా ఆకుల వాగ్వాదానికి దిగారు. సోనియా ఆకుల తనని నామినేషన్ చేసిందనే కారణంతో కిర్రాక్ సీత ఆమెను బూతులు తిట్టింది. నీకే క్లారిటీ లేదు. బొ** క్లారిటీ పెద్ద నీకే ఉన్నట్లు' అంటూ బూతులు మాట్లాడింది.దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన సోనియా ఆకుల, పద్దతిగా మాట్లాడలంటూ సీతను కోరడం జరిగింది. నేను నిన్ను అనలేదంటూ సీత సోనియాకు తెలిపడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications