Bigg Boss Telugu 9:టైటిల్ పోయినా..తనూజకు కాసుల వర్షం..!!

Tanuja BB9 Remuneration:బుల్లితెర అతిపెద్ద రియాలిటీ షో 'బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9' సుదీర్ఘంగా 105 రోజుల పాటు సాగిన వినోద పోరాటానికి ఆదివారంతో తెరపడింది. ఎన్నో మలుపులు, మరెన్నో ఉత్కంఠభరిత క్షణాల మధ్య సాగిన ఈ సీజన్ క్లైమాక్స్ అందరినీ ఆశ్చర్యపరిచింది. మాజీ ఆర్మీ జవాన్, కామనర్ ప్రతినిధి కళ్యాణ్ పడాల విజేతగా నిలిచి ట్రోఫీని ముద్దాడగా.. ఆరంభం నుండి టైటిల్ ఫేవరెట్‌గా నిలిచిన నటి తనూజ రన్నరప్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

తనూజ: ఆరంభం అద్భుతం.. కానీ చివరిలో ఎక్కడ బెడిసికొట్టింది?
సీజన్ ప్రారంభమైన మొదటి రోజు నుండే తనూజ హౌస్‌లో తనదైన ముద్ర వేసింది. ఏ విషయంలోనైనా భయం లేకుండా తన గొంతు వినిపించడం, టాస్కుల్లో మగవారితో సమానంగా పోరాడడం ఆమెకు భారీ ఫ్యాన్ బేస్‌ను తెచ్చిపెట్టింది. "ఈసారి విన్నర్ కచ్చితంగా ఒక మహిళే" అన్న నమ్మకాన్ని తన ఆటతీరుతో కలిగించింది. అయితే, చివరి వారాల్లో కొన్ని సమీకరణాలు ఆమెకు ప్రతికూలంగా మారాయి.

bigg-boss-telugu-9-winner-kalyan-padala-wins-trophy-tanuja-s-remuneration-revealed

ముఖ్యంగా భరణితో ఆమెకు ఉన్న బాండింగ్, కొన్ని అనవసరమైన వాదనలు, అతిగా ఎమోషనల్ కావడం వంటివి ఆమె గ్రాఫ్‌ను తగ్గించాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అదే సమయంలో కళ్యాణ్ పడాలతో ఆమెకు ఉన్న సాన్నిహిత్యం వల్ల ఓట్లు చీలడం కూడా తనూజకు గట్టి దెబ్బే తగిలింది.

'సైలెంట్ కిల్లర్'గెలుపు వెనుక రహస్యం ఇదే!
కళ్యాణ్ ప్రయాణం సామాన్యులందరికీ ఒక పెద్ద పాఠం. ఆర్మీ క్రమశిక్షణతో హౌస్‌లో అడుగుపెట్టిన ఆయన.. గొడవలకు దూరంగా ఉంటూనే తన పనిని తాను చేసుకుపోయారు. తక్కువ మాట్లాడి, ఎక్కువ ఫలితాన్ని చూపించడం ఆయన స్టైల్. 'జై జవాన్' అన్న ఇమేజ్ తో పాటు ఆయన సింప్లిసిటీ ప్రేక్షకులను కట్టిపడేసింది. సెలబ్రిటీల మధ్య ఒక సామాన్యుడు అంత ధైర్యంగా నిలబడడం చూసి జనం నీరాజనాలు పట్టారు. ఫలితంగా భారీ ఓటింగ్ తో కళ్యాణ్ విజేతగా నిలిచారు.

నగదు, కారు.. కళ్యాణ్ సంపాదన ఎంత?
విజేతగా నిలిచిన కళ్యాణ్ పడాల కేవలం ట్రోఫీని మాత్రమే కాదు, భారీగా కాసులను కూడా వెనకేశారు.

  • నగదు బహుమతి: రూ. 35 లక్షలు.
  • కారు: ఖరీదైన మారుతి సుజుకి కారు.
  • గిఫ్ట్ వోచర్స్: మరో రూ. 5 లక్షల విలువైన వోచర్లు.
  • రెమ్యునరేషన్: వారానికి రూ. 70 వేల చొప్పున 15 వారాలకు గానూ మరో రూ. 10.5 లక్షలు. మొత్తంగా చూస్తే కళ్యాణ్ సుమారు రూ. 60 నుండి 70 లక్షల వరకు సంపాదించినట్లు తెలుస్తోంది.

తనూజ:టైటిల్ లేదు కానీ.. సంపాదనలో తోపు!
తనూజ రన్నరప్‌గా నిలిచినప్పటికీ, ఆర్ధికంగా మాత్రం ఆమె గట్టిగానే లాభపడింది.తనూజా పాపులర్ సెలబ్రిటీ కావడంతో ఆమెకు వారానికి భారీ పారితోషికం అందినట్లు తెలుస్తోంది.సమాచారం ప్రకారం ఆమెకు వారానికి ₹4 లక్షల నుంచి ₹5 లక్షల వరకు చెల్లించారు. 15 వారాల పాటు హౌస్‌లో ఉన్న తనూజా, కేవలం పారితోషికం రూపంలోనే సుమారు ₹60 లక్షల నుంచి ₹70 లక్షల వరకు సంపాదించినట్లు అంచనా.టైటిల్ మిస్ అయినందుకు ఆమె అభిమానులు బాధపడుతున్నప్పటికీ, 105 రోజుల పాటు ఆమె సంపాదించిన పాపులారిటీ మరియు పారితోషికం చూస్తే ఆమె ఈ సీజన్ లో 'క్వీన్' అని చెప్పక తప్పదు.

ఏది ఏమైనా బిగ్‌బాస్ సీజన్ 9 ఒక సామాన్యుడిని రాజును చేసింది. కళ్యాణ్ పడాల గెలుపు ఒక క్రమశిక్షణకు నిదర్శనం అయితే, తనూజ పోరాటం ఒక ధైర్యానికి సంకేతం. ట్రోఫీ ఎవరు గెలిచినా.. 105 రోజుల పాటు ప్రేక్షకులను అలరించడంలో వీరిద్దరూ నూటికి నూరు శాతం విజయం సాధించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+