నటి డ్రెస్ జిప్ తీసేసిన హీరో: డైరెక్టర్ కట్ చెప్పినా ఆగని రొమాన్స్!

సినిమా షూటింగ్స్ అంటే కేవలం గ్లామర్ మాత్రమే కాదు.. కొన్ని సార్లు నటీనటులు తమ పాత్రల్లో ఎంతగా లీనమైపోతారంటే.. చుట్టూ కెమెరాలు ఉన్నాయన్న విషయం కూడా మర్చిపోతుంటారు. ముఖ్యంగా రొమాంటిక్, ఇంటిమేట్ సీన్లను చిత్రీకరించేటప్పుడు దర్శకుడు కట్ చెప్పినా వినబడనంతగా రెచ్చిపోయిన సందర్భాలు బాలీవుడ్‌లో ఎన్నో ఉన్నాయి. సెట్‌లో వందల మంది చూస్తున్నారన్న సోయి లేకుండా.. దర్శకుడు సీన్ ఆపమని చెప్పినా వినకుండా ముద్దుల్లో మునిగిపోయిన హీరోహీరోయిన్లు వీరే..

రణవీర్ సింగ్-దీపికా పదుకొణె

బాలీవుడ్ స్టార్ కపుల్ రణవీర్ సింగ్, దీపికా ప్రేమాయణం 'గోలియోన్ కీ రాసలీలా - రామ్ లీలా' సెట్‌లోనే మొదలైంది. ఈ సినిమాలోని ఓ ఇంటిమేట్ సీన్ చిత్రీకరిస్తున్నప్పుడు.. వీరిద్దరూ ఒకరినొకరు ముద్దుపెట్టుకోవడంలో ఎంతగా లీనమైపోయారంటే.. డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ 'కట్' అని గట్టిగా అరిచినా వారు వినలేదు. ఆ సమయంలో వీరిద్దరూ డేటింగ్‌లో ఉండటంతో ఆ రొమాన్స్‌లో లీనమైపోయారని అప్పట్లో టాక్ నడిచింది.

Bollywood Actors Who Didn t Stop After Cut Ranveer Ranbir and Vinod Khanna Intimate Scene Stories

వినోద్ ఖన్నా-మాధురీ దీక్షిత్

దివంగత నటుడు వినోద్ ఖన్నా విషయంలో ఇలాంటి వివాదాలు అనేకం ఉన్నాయి. 'దయావాన్' సినిమా షూటింగ్ సమయంలో మాధురీ దీక్షిత్‌తో ఓ రొమాంటిక్ సీన్ చేస్తున్నప్పుడు వినోద్ ఖన్నా నియంత్రణ కోల్పోయారు. ఆ సీన్ ఎంత తీవ్రంగా మారిందంటే.. ఆయన మాధురి పెదవిని గట్టిగా కొరకడంతో రక్తం కూడా వచ్చిందట. ఈ ఘటనతో మాధురి దీక్షిత్ తీవ్రమైన అవమానానికి గురయ్యారు. తర్వాత వినోద్ ఖన్నా మాధురికి క్షమాపణలు చెప్పారు. డింపుల్ కపాడియాతో షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా ఆయన ఇలాగే ప్రవర్తించారని సమాచారం.

సిద్ధార్థ్ మల్హోత్రా-జాక్వెలిన్ ఫెర్నాండెజ్

'ఏ జెంటిల్‌మెన్' సినిమా షూటింగ్‌లో సిద్ధార్థ్, జాక్వెలిన్ మధ్య ఓ సుదీర్ఘమైన కిస్సింగ్ సీన్ ఉంది. సీన్ పూర్తయ్యాక డైరెక్టర్ 'కట్' అని చెప్పినా, వీరిద్దరూ ఒకరినొకరు ముద్దుపెట్టుకుంటూనే ఉన్నారు. దీంతో సెట్‌లోని వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కేవలం సిద్ధార్థ్‌తోనే కాదు, 'ది ఫ్లయింగ్ జట్' సినిమాలో టైగర్ ష్రాఫ్ కూడా జాక్వెలిన్‌తో కిస్ సీన్ చేస్తున్నప్పుడు కట్ చెప్పినా ఆగలేదని బాలీవుడ్ మీడియా కోడై కూసింది.

రణబీర్ కపూర్-ఎవెలిన్ శర్మ

'యే జవానీ హై దీవానీ' సినిమాలో రణబీర్ కపూర్, ఎవెలిన్ శర్మ మధ్య ఓ లవ్ మేకింగ్ సీన్ ఉంటుంది. ఈ సీన్ చిత్రీకరణ సమయంలో రణబీర్ తన పాత్రలో ఎంతగా లీనమైపోయారంటే.. దర్శకుడు అయాన్ ముఖర్జీ మాటలను కూడా ఆయన పట్టించుకోకుండా సీన్ కొనసాగించారు.

రుస్లాన్ ముంతాజ్ - చేత్న పాండే

'ఐ డోంట్ లవ్ యూ' చిత్రం షూటింగ్ సమయంలో రుస్లాన్ ముంతాజ్ తన కో-స్టార్ చేత్న పాండేతో రొమాంటిక్ సీన్ చేస్తూ భావోద్వేగాలకు లోనయ్యాడు. సీన్ మధ్యలో ఆమె డ్రెస్ జిప్ తీసేయడంతో సెట్‌లో కలకలం రేగింది. ఆ తర్వాత తన ప్రవర్తనకు రుస్లాన్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. హీరోహీరోయిన్లు తమ పాత్రల్లో సహజత్వం కోసం ప్రయత్నిస్తారని.. అయితే కొన్ని సార్లు కెమెరా ముందున్నామన్న స్పృహ కోల్పోవడం వల్ల ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని సినీ విశ్లేషకులు చెబుతుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+