అరుదైన ఘనత సాధించిన బాలీవుడ్ నటి దీపికా పదుకొణే..!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె పేరు తెలియని వారుండరు. ఓం శాంతి ఓం సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన దీపికా అనతి కాలంలోనే స్టార్‌డమ్‌ను సంపాదించుకుంది. ఇప్పడు అగ్రనటుల్లో ఒకరిగా ఉన్నారు. ఈ నటి ఇప్పడు సౌత్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజిగా ఉన్నారు. ప్రభాస్ 'కల్కి AD 2898 సినిమాతో దీపిక తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టనున్నారు.
ఇవే కాకుండా ఆమె చేతిలో పలు ప్రాజెక్టులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కల్కి సినిమాలో దీపిక కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాకు నాగ్అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నసంగతి తెలిసిందే. ఈ మూవీ జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. అయితే, తాజాగా దీపికా అరుదైన ఘనత సాధించింది.

హాలీవుడ్ మ్యాగజైన్ డెడ్‌లైన్స్ గ్లోబల్ డిస్‌రప్టర్స్ 2024 జాబితాలో దీపిక చోటు సంపాదించుకుంది. ప్రపంచవ్యాప్తంగా వినోదరంగంలో రాణిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న నటీనటుల జాబితాను ప్రతి ఏడాది ఈ మ్యాగజైన్ విడుదల చేస్తుంది. ఇక, ఈ ఏడాది విడుదల చేసిన ఈ జాబితాలో బాలీవుడ్ నటి దీపికా స్థానాన్ని దక్కించుకుంది. ఈ మ్యాగజైన్‌లో చోటు దక్కించుకున్న మొదటి ఇండియన్ యాక్టర్‌గా దీపిక నిలవడం విశేషం. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దీపిక పలు విషయాలను అభిమానులతో పంచుకుంది. అవేంటో చూద్దాం..

ఎలాండి అడిషన్ లేకుండానే..
'ఒక మంచి వ్యక్తిగా ఎదగడం, మంచి వ్యక్తులతో సమయం గడపడం, సెట్‌లోని అనుభవాలను జ్ఞాపకాలుగా గుర్తుచేసుకోవడం ఇవే నా దృష్టిలో ముఖ్యమైనవి. ఇప్పుడు దక్కిన ఈ గౌరవానికి కూడా ఇదే కారణంగా భావిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది. 2007లో ఓం శాంతి ఓం సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టాను. ఈ సినిమాకు అసలు నేను ఎలాంటి ఆడిషన్ ఇవ్వలేదు.
ఈ మూవీ డైరెక్టర్ ఎలాంటి ఆడిషన్ లేకుండానే నన్ను సెలక్ట్ చేశారు. నాలో ఓ స్టార్ ఉందని, నాపై నమ్మకంతోనే ఈ అవకాశం ఇచ్చామని చిత్ర యూనిట్ చెప్పడంతో ఎంతో సంతోషించాను. ఆ సినిమాతో నా సినీ ప్రయాణం మొదలయ్యింది. ప్రతి సినిమాలో అనేక విషయాలు నేర్చుకున్నా. ఇప్పుడు బాలీవుడ్‌తోపాటు నన్ను హాలీవుడ్‌లోనూ ప్రేక్షకులు ఆదరిస్తున్నారు అంటూ తన సినీ ప్రస్థానం గురించి చెప్పుకొచ్చారు దీపికా..












Click it and Unblock the Notifications