ప్రభాస్ ముందు అల్లు అర్జున్ ఓ పిల్ల బచ్చా..బాలీవుడ్ సంచలనం

సినీ ఇండస్ట్రీలో హీరోల మధ్య పోటీ అనేది సర్వసాధారణం. గతంలో ఎన్టీఆర్, చిరంజీవిలు నెంబర్ వన్ హీరోలు కొనసాగారు.నేటితరంలో నెంబర్ హీరో ఎవరంటే ఠక్కున చెప్పడం కాస్తా కష్టమే. బాక్సాఫీస్ లెక్కల ప్రకారం చూసుకుంటే తెలుగులో నెంబర్ వన్ హీరో ప్రభాస్ అనే చెప్పాలి. బాహుబలి తరువాత ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది.

బాహుబలి తరువాత ప్రభాస్ నటించిన సినిమాలు ఫెయిల్ అయినప్పటికీ ఆయన సినిమాలు వందల కోట్లు కలెక్ట్ చేయడంతో బాక్సాఫీస్ అతనే నెంబర్ వన్‌ హీరో అని చెబుతోంది.ఇదే సమయంలో పుష్పతో అల్లు అర్జున్ సైతం ప్యాన్ ఇండియా రేంజ్‌లో సత్తా చాటాడు. ఏమాత్రం అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో పుష్ప-2 సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.

bollywood critic krk shocking comments about prabhas and allu arjun

ఇప్పటికే ప్రభాస్, అల్లు అర్జున్ అభిమానులు తమ హీరో గొప్ప అంటే తమ హీరోనే గొప్ప అంటూ సోషల్ మీడియా వేదికగా యుద్ధం చేసుకుంటున్నారు. తాజాగా అభిమానుల మధ్య మరింత ఆజ్యం పోశారు ఓ బాలీవుడ్ క్రిటిక్. కేఆర్‌కే ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు కానీ.. బాలీవుడ్ అభిమానులకు కేఆర్‌కే సుపరిచితుడే. ఎంతటి స్టార్ హీరోల సినిమాలను అయినా మనోడే పూచిక పుల్లతో తీసిపడేస్తాడు. ఇంకా చెప్పాలంటే బాలీవుడ్ సినిమాలను ఏకిపారేస్తాడు.

తాజాగా కేఆర్‌కే అల్లు అర్జున్, ప్రభాస్‌ల గురించి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ప్రభాస్‌ను అల్లు అర్జున్‌తో పోల్చొద్దు అని చెప్పాడు. బాలీవుడ్‌లో ప్రభాస్ రేంజ్ వేరని, అతను అందగాడు అని తెలిపాడు. ముందుగా అల్లు అర్జున్ మరియు ప్రభాస్ మధ్య పోలిక లేదని నేను స్పష్టం చేస్తాను.

ప్రభాస్ సినిమా విజయం సాధించినా, సాధించకపోయినా, అతను అద్భుతమైన ఫిజిక్‌తో చాలా ఆకట్టుకునే, అందమైన హీరో. అతనితో పోలిస్తే అల్లు అర్జున్ చిన్నపిల్లడిలా కనిపిస్తున్నాడు. అల్లు అర్జున్ ఫిజిక్‌లో కానీ, హిట్‌‌లో కానీ ప్రభాస్‌తో తక్కువుగానే కనిపిస్తాడు. అల్లు అర్జున్ గురించి బాలీవుడ క్రిటిక్ కేఆర్‌కే చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అల్లు అర్జున్‌పై బాలీవుడ్ క్రిటిక్ కేఆర్‌కే చేసిన వ్యాఖ్యలపై ఆయన అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+