మణిపురి సంప్రదాయంలో పెళ్లిచేసుకున్న బాలీవుడ్ స్టార్ హీరో..
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌దీప్ హుడా ఓ ఇంటివాడయ్యాడు. రణదీప్ తను ప్రేమించిన అమ్మాయిని ఎంతో సంప్రదాయబద్దంగా వివాహం చేసుకున్నారు. మణిపురికి చెందిన నటి లిన లైష్రామ్‌తో నిన్నరాత్రి ఆయన వివాహం ఎంతో గ్రాండ్‌గా జరిగింది. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్న రణ్‌దీప్ హుడా లేట్ వయసులో వివాహం చేసుకున్నారు. మణిపూర్‌కి చెందిన నటి, మోడల్ లిన్ లైష్రామ్‌తో రణదీప్ మణిపూరీ సంప్రదాయంలో ఎంతో వైభవంగా వివాహం చేసుకున్నారు. మణిపూర్ రాజధాని ఇంపాల్‌లోని ఓ దేవాలయంలో వీరి వివాహం సాంప్రదాయ పద్ధతిలో చాలా సింపుల్‌గా జరిగింది. ఈ సందర్భంగా రణ్‌దీప్ హుడా తన పెళ్లి ఫోటోలను సోషల్‌మీడియాలోని తన ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ పెళ్లి తంతు కాస్తా నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

మణిపూర్ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా పెళ్లి : ఈ పెళ్లిలో వధువరూలిద్దరూ మణిపురి సాంప్రదాయ వివాహ పద్ధతిలో కనిపించారు. రణదీప్ వైట్ కుర్తా, దోతిలో ధరించి రాయల్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఇక లిన్ ఎంతో ఎట్రాక్ష్‌న్‌గా ఉంది. ఆమె మణిపురి సాంప్రదాయాన్ని తలపించేలా పెళ్లి దుస్తులు ధరించింది. వైట్ అండ్ పింక్ శారీ బ్లాక్ బ్లౌజ్ ధరించడంతోపాటు, గోల్డ్ జ్యూవెల్లరి ధరించి ఎంతో అందంగా ముస్తాబయ్యి అందరిని ఆకర్షించింది. ఈ సందర్భంగా వారి పెళ్లి ఫోటోలను సోషల్‌మీడియాలో పంచుకుంటూ రణ్ దీప్ హుదా పోస్ట్ చేశారు. తాము ఒక్కటయ్యామని, జస్ట్ ఇప్పుడే పెళ్లి అయ్యిందని చెబుతూ, లవ్ హార్ట్ ఎమోజీని అభిమానులతో పంచుకున్నారు.
అంతకు ముందు సోషల్‌మీడియాలో తన అనుభవాలను పంచుకున్నారు. మణిపూర్ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా పెళ్లి చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, వధువు సాంప్రదాయంలో పెళ్లి చేసుకోవడం చాలా గౌరవప్రదమైనదిగా భావిస్తున్నాని, ఈ పెళ్లి వేడుక కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నా, ఎలాంటి తప్పులు చేయనని ఆశిస్తున్నా అంటూ చెప్పుకోచ్చారు. ఇక, పెళ్లి అనంతరం, ఈ గుడ్‌న్యూస్‌ను అభిమానులతో పంచుకున్నారు. మహాభారతంలో అర్జునుడు ఎక్కడ అయితే మణిపుర్ యువరాణి చిత్రాంగదను వివాహం చేసుకున్నారో అక్కడే కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో మేం ఒక్కటి కాబోతున్నాం" అంటూ రణ్‌దీప్ చెప్పారు.
బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడ ఎక్కువగా విలన్ పాత్రలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇక తన భార్య లిన్ లైష్రామ్ కూడా మణిపురి నటిగా రాణిస్తుంది. బాలీవుడ్‌లోనూ ఆమె అనేక సినిమాల్లో నటించారు. ఓం శాంతి ఓం, మేరీ కోమ్, రంగూన్, జానే జాన్ వంటి సినిమాల్లో నటించి మెప్పించారు.












Click it and Unblock the Notifications