స్కంద సినిమాకు బోయపాటి రెమ్యునరేషన్
దర్శకుడు బోయపాటి శ్రీను తనదైన శైలిలో సినిమాలు తీస్తుంటారు. హీరోను సూపర్ హీరోగా చూపిస్తారు. అందుకు లాజిక్స్ ను కూడా పట్టించుకోరు. మొదట్లో బోయపాటికి దర్శకుడు కొరటాల కథలను సమకూర్చేవారు ఇప్పుడు కొరటాల కూడా దర్శకుడైన తర్వాత మంచి కథలను బోయపాటి ఎంపిక చేసుకోలేకపోతున్నాడని చెప్పవచ్చు. మాస్ ప్రేక్షకులకు కావల్సిన అన్ని అంశాలను మాత్రం తన సినిమాలో దట్టంగా పట్టిస్తారు.
తాజాగా విడుదలైన స్కంద చిత్రం పర్వాలేదనిపించుకుంది. వాస్తవానికి ఈ సినిమాకు పబ్లిసిటీ చేయడంలో టీమ్ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని చెప్పవచ్చు. సినిమాకు పబ్లిసిటీ బాగా ఉండివుంటే ఇంకా బాగా హిట్టయ్యేదని, ఇప్పుడు మాత్రం అంచనాలను అందుకోలేకపోతోందంటున్నారు. కథకన్నా హీరోని చూపించే విధానం, ఫైట్లు, సన్నివేశాల్లాంటివాటిమీదే దృష్టిపెడతాడు. గత మూడు, నాలుగు సినిమాలను పరిశీలించినా మనకు ఇదే అవగతమవుతుంది.

హీరోను చూపించే విధానంవల్లకానీ లేదంటే టేకింగ్ పరంగాకానీ తనదైన శైలిలో సినిమాలుతీసే బోయపాటి ప్రతి చిత్రానికి తన రెమ్యునరేషన్ ను పెంచుకుంటూ వస్తున్నారు. స్టార్ హీరోలతో సమానంగా ఆయన పారితోషికం ఉంటోంది. స్కంద సినిమాకు రూ.15కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. అఖండ కాకుండా జయజానకి నాయక, వినయ విధేయరామ లాంటి సినిమాలు ఫ్లాపైనా సినిమా సినిమాకు పారితోషికాన్ని మాత్రం పెంచుకుంటూ వస్తున్నారు. అయితే స్కంద సినిమాకు తీసుకున్నది తక్కువేనని చెప్పవచ్చు. బోయపాటి చేస్తున్న సినిమాలన్నీ దాదాపుగా ఒకే కథ, ఒకే పాయింట్ తో వస్తున్నాయని, అలా కాకుండా భవిష్యత్తులో తీయబోయే సినిమాలకు సంబంధించిన కథలను మార్చాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications