వాళ్లు అందరూ సర్వనాశనం అయిపోతారు - చలాకీ చంటి

ఈటీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్‌ కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. జబర్దస్త్‌ ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయ్యి, కొన్నాళ్ల తర్వాత సినిమాల్లో నటిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. అయితే చలాకీ చంటి మాత్రం సినిమా ఇండస్ట్రీ నుంచి జబర్దస్త్‌కు వెళ్లాడు. అక్కడ దాదాపు ఆరు సంవత్సరాల పాటు సందడి చేశారు. జబర్దస్త్‌ నుంచి బిగ్‌బాస్ కి వెళ్లి, తిరిగి జబర్దస్త్‌ స్టేజ్ ఎక్కిన చలాకీ చంటి తన కామెడీతో నవ్వించారు. తన టైమింగ్, పంచ్ డైలాగ్స్, బాడీ లాంగ్వేజ్‌తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.

అయితే ఇప్పుడు మళ్ళీ జబర్దస్త్ లో ఆయన సందడి చేస్తున్నారు. అంతకు ముందు మాత్రం టీవీ షోలకు, సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఈ క్రమంలోనే గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చంటి పలు విషయాలపై ఓపెన్ అయ్యారు. తాను ఇండస్ట్రీకి దూరమవడానికి గల కారణాలు, తనపై ఉన్న ఈగో ముద్ర.. తనకు జరిగిన నమ్మకద్రోహం వంటి విషయాలపై కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు ఇప్పుడు మళ్లీ వెలుగులోకి రాగా ఫుల్ ట్రెండింగ్ గా మారాయి.

chalaki-chanti-who-is-prominent-comedian-from-jabardasth-shocking-comments-in-old-interview

చంటి మాట్లాడుతూ..

తన ఆరోగ్యం గురించి అసత్య వార్తలు ప్రచారం చేసిన వారు సర్వనాశనం అవుతారని.. తాను బ్రతికి ఉండగానే అది చూడాలని శపించాడు. కొంతమంది తనను వెన్నుపోటు పొడిచారని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. మనుషులు డబ్బు ఉన్నప్పుడే చుట్టూ ఉంటారని, కష్టాల్లో ఉన్నప్పుడు నిజమైన స్నేహితులు ఎవరో తెలుస్తుందని ఆయన అన్నారు. ఒక మనిషికి డబ్బు లేకపోతే సమాజంలో విలువ ఉండదని, తన అనుభవంలో అది నిజమని తెలిపారు.

అంతే కాకుండా ఇండస్ట్రీలో తనపై "ఈగో" ముద్ర వేసారని, అది 2014 నుంచే మొదలైందని చెప్పారు. 2013లో జబర్దస్త్ ప్రారంభమై, ఏడాది తర్వాతే తనపై విమర్శలు మొదలయ్యాయని గుర్తుచేశారు.
తనను కొందరు వెన్నుపోటు పొడిచారని, తాను నష్టపోయానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. "నాలో తప్పు లేకపోయినా, పరిస్థితులు నన్ను దూరం చేశాయి" అని చంటి పేర్కొన్నారు. కొంతమంది స్నేహితులపై పెట్టుకున్న నమ్మకం తనను మోసం చేసిందని కూడా చెప్పారు. ఇక బిగ్ బాస్ కార్యక్రమం వల్ల తనకు ఎలాంటి లాభం లేదని చంటి నిర్మొహమాటంగా చెప్పాడు. కెరీర్‌కు గానీ, ఆర్థికంగా గానీ రూపాయి కూడా ప్రయోజనం కలగలేదని అన్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+