'చికిరి చికిరి' పాట మేకింగ్ వీడియో చూశారా..? ఎంత కష్టపడ్డారో..!
ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా 'చికిరి చికిరి' వైబ్ కనిపిస్తోంది. చంటి పిల్లల నుంచి పండు ముసలి వరకూ ఈ సాంగ్ లోని హుక్ స్టెప్ ను వేస్తున్నారు. అంతలా ఈ సాంగ్ జనాల్లోకి వెళ్లిపోయింది. ఇప్పటికే గ్లోబల్ సెన్సేషన్ అయి దూసుకెళ్తోంది. ఇన్ స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ లో ఈ పాట సంచలనంగా మారుతోంది. ఈ సాంగ్ ఏకంగా 13 దేశాల్లో యూట్యూబ్ ట్రెండింగ్ లో ఉంది. ఓ వైపు ఏ ఆర్ రెహమాన్ క్లాసీ మ్యూజిక్.. రామ్ చరణ్ ఊరమాస్ స్టెప్పులు అటు ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ ను పిచ్చెక్కిస్తున్నాయి.

ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తున్న 'పెద్ది' మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్ బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. అయితే తాజాగా చిత్ర బృందం 'చికిరి చికిరి' సాంగ్ కు సంబంధించిన మేకింగ్ వీడియో పోస్టు చేసింది. ఈ పాటకు 100 మిలియన్ వ్యూస్ వచ్చిన సందర్భంగా మేకర్స్ ఇవాళ మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో 'చికిరి చికిరి' సాంగ్ కోసం చిత్ర బృందం పడిన కష్టం కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ మేకింగ్ వీడియో సోషల్ మీడియాను ఒక రేంజ్ లో ఊపేస్తోంది.
ఇక బుచ్చి బాబు సానా దర్శకత్వంలో వస్తున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా షూటింగ్ వేగంగా సాగుతోంది. రామ్ చరణ్ ఈ సినిమాలో కొత్త లుక్‌తో కనిపించనున్నారు. గ్రామీణ ప్రాంతంలో క్రికెట్ టోర్నమెంట్ నేపథ్యంలో 'పెద్ది' మూవీ రూపొందుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తోంది. శివరాజ్ కుమార్, దివ్యేందు, జగపతిబాబు కీలక పాత్రల్లో ఉన్నారు. ఈ మూవీ 2026 మార్చి 27న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
-
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మెగాస్టార్, లేడీ సూపర్ స్టార్.. మరో భారీ ప్రాజెక్ట్! -
మహేష్‌బాబుకు బాగా ఇష్టమైన అల్లు అర్జున్ సినిమా -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
'పెద్ది' సినిమా వాయిదా..? నిర్మాత సంచలన ప్రకటన.. -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
సింగర్ గానే షేక్ చేసేసింది.. డాన్సర్‌గా అంటే థియేటర్స్ తగలబడడమే !! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ !! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications