చిరంజీవి - జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో మిస్ అయిన బ్లాక్‌బస్టర్
మెగాస్టార్ చిరంజీవి నాలుగు దశాబ్దాలకు పైగా తెలుగు చిత్రసీమలో కొనసాగుతున్నారు. మూడు దశాబ్దాలకు పైగా అగ్ర కథానాయకుడిగా చెలామణి అయ్యారు. ఇప్పుడు కూడా యువ కథానాయకులకు ధీటుగా సినిమాలు చేస్తూ వారికి సవాల్ విసురుతున్నారు. వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర చేస్తున్న చిరంజీవి తర్వాత శ్రీకాంత్ ఓదెల, అనిల్ రావిపూడితో సినిమాలు తీయబోతున్నారు. మెగాస్టార్ గా ఎనలేని కీర్తిని సంపాదించుకున్న చిరంజీవి పేరు దేశవ్యాప్తంగా తెలియనివారుండరు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 చిత్రం షూటింగ్ ను పూర్తిచేశారు. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన విడుదల కాబోతోంది. దీనితర్వాత ప్రశాంత్ నీల్ సినిమా డ్రాగన్ షూటింగ్ లో పాల్గొంటారు. వచ్చే ఏడాది జనవరి 9వ తేదీన ఇది విడుదల కాబోతోంది.
చెప్పుడు మాటలు వినడంవల్ల అలా జరిగింది
మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా తీయడానికి గతంలో ప్రయత్నాలు జరిగాయికానీ పట్టాలెక్కలేదు. తారక్ తో ఆంధ్రావాలా సినిమా తీసిన గిరి ఈ విషయాన్ని వెల్లడించారు. చిరంజీవిపై గౌరవం పెంచుకున్న ఎన్టీఆర్ ఆయన తనయుడు రామ్ చరణ్ తో కలిసి ఆర్ఆర్ఆర్ చేసిన సంగతి తెలిసిందే. కొందరు చెప్పుడు మాటలవల్ల గిరితో తారక్ కు కొంతకాలం దూరం పెరిగింది. తర్వాత ఎన్టీఆర్ గిరితో వేరేవారి మాటలవల్ల అలా జరిగింది.. ఇకనుంచి అలా జరగదు.. మనం కలిసి ఓ సినిమా చేద్దామని అన్నారు. తనను, నల్లమలుపు శ్రీనివాస్ ను ఎన్టీఆర్ రాజమౌళి దగ్గరకు తీసుకువెళ్లి గిరికి ఓ సినిమా చేయాలని అడిగారని, చేద్దామని రాజమౌళి చెప్పినట్లు గిరి వెల్లడించారు. అయితే రోజులు గడుస్తున్నప్పటికీ రాజమౌళితో సినిమా తీయడానికి వీలుపడలేదు.

రికార్డులేవీ మిగిలేవి కాదు
ఆ తర్వాత తాను ఓ కథను తారక్ కు చెప్పానని, చిరంజీవితో మల్టీస్టారర్ చేస్తే బాగుంటుందని చెబితే వెంటనే చేద్దామన్నారు. మన దేశ వీరుల్లో ఒకరైనా రాణా ప్రతాప్ సింగ్ కథ అది అని, ఆ కథలో రాణా ప్రతాప్ సింగ్, అక్బర్ కు మధ్య చాలా కథ ఉందని, చిరంజీవి, తారక్ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో దీన్ని చేద్దామనుకున్నామని చెప్పారు. ఈ రెండు పాత్రలకు చిరంజీవి, ఎన్టీఆర్ అనుకున్నామని, తనకెటువంటి అభ్యంతరం లేదని ఎన్టీఆర్ అన్నారని, అయితే దర్శకుడగా రాజమౌళిని అనుకున్నామని, కుదరకపోతే సురేందర్ రెడ్డితో తీయాలని భావించినట్లు గిరి చెప్పారు. అయితే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదని, లేదంటే రికార్డులేవీ మిగలకుండా బ్లాక్ బస్టర్ సినిమా అయ్యేదని గిరి అన్నారు.












Click it and Unblock the Notifications