స్టార్ హీరో కొడుకుతో చిరంజీవి కూతురి పెళ్లి?
మెగాస్టార్ చిరంజీవి అంటే భారతదేశ సినీ చరిత్రలో తెలియనివారు ఉండరు. క్యారెక్టర్ యాక్టర్ గా, విలన్ గా చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ అగ్ర కథానాయకుడిగా ఎదిగారు. తన నటన, నృత్యాలు, పోరాటాలతో ప్రత్యేకమైన అభిమానులను సంపాదించుకున్నారు. ఆయనకు బలమైన ఫ్యాన్ బేస్ ఉందని చెప్పొచ్చు. అలాగే ఆయన తమ్ముడు పవన్ కల్యాణ్, కొడుకు రామ్ చరణ్, మేనల్లుడు అల్లు అర్జున్, మరో మేనల్లుళ్లు, నాగబాబు కొడుకు వరుణ్ తేజ్.. ఇలా తామర తుంపరలుగా ఒకరి వెంట ఒకరు సినీ పరిశ్రమలో హీరోలుగా నటిస్తున్నారు.
చిరంజీవికి సంబంధించిన ఒక పాత వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చిరంజీవి పెద్ద కూతురు సుస్మితకు సంబంధించిన వార్త ఇది. చిరుకు తన పిల్లలంటే ఎంతో ప్రాణం. వారిని బాగా గారాబం చేస్తారు. తన కూతురికి పెళ్లి చేసే విషయంలో ఆయన ఎంతో దూరం ఆలోచించారు. మంచి కుటుంబంలో ఇవ్వాలని చూశారు. ఓ స్టార్ హీరో కొడుకుకు ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ పెద్దింటికి కోడలిగా పంపిద్దామని అందరూ నిర్ణయించుకొని ముహూర్తం కూడా పెట్టించారు. అయితే ఆ సమయంలోనే చిరుకు ఊహించనిరీతిలో షాక్ తగిలింది.

సుస్మిత ఒక యంగ్ హీరోతో ప్రేమలో ఉన్న విషయం తెలియడంతో చిరంజీవి షాకయ్యారు. తన కూతురి సంతోషం కోసం ఆ స్టార్ హీరోకు ఇచ్చిన మాటను వెనక్కి తీసుకున్నారు. తర్వాత వివాహం చేయాలనే ప్రతిపాదన కూడా వెనక్కి తీసుకున్నారు. తర్వాత జరిగిన కొన్ని పరిణామాలతో సుస్మిత తాను ప్రేమించిన హీరోను కాకుండా ఇంట్లో పెద్దలు చూసిన మరో సంబంధం చేసుకొని సంతోషంగా జీవిస్తోంది.
ఎప్పుడో జరిగిపోయిన ఈ వార్త ప్రస్తుతం వైరలవుతోంది. సామాజిక మాధ్యమాల్లో ఈ వార్తను బాగా ట్రెండ్ చేస్తున్నారు. చిరంజీవి ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర చిత్రం చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది.












Click it and Unblock the Notifications