చిరంజీవి రిజెక్ట్ చేస్తే.. మోహన్ బాబు బ్లాక్ బస్టర్ కొట్టాడు!
మోహన్ బాబు కథానాయకుడిగా సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం 'అల్లుడుగారు'. 90వ దశాబ్దంలో మోహన్ బాబుకు 'కలెక్షన్ కింగ్' అనే బిరుదు రావడానికి, సినీ పరిశ్రమ నుంచి వెళ్లిపోకుండా చూడటానికి, విద్యాసంస్థల ఏర్పాటుకు, రాజకీయ నాయకుడిగా మారడానికి.. ఇలా అనేకరకాలైన అవకాశాలను 'అల్లుడుగారు' సినిమా మోహన్ బాబుకు కల్పించింది. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా సంచలన విజయాన్ని సాధించింది.
చిరంజీవి అయితే బాగుంటుందని : తన సొంత నిర్మాణ సంస్థ అయిన శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై మోహన్ బాబు నిర్మించారు. వాస్తవానికి ఈ సినిమా కథ ముందుగా చిరంజీవి వద్దకు చేరింది. దర్శకుడు రాఘవేంద్రరావు ఇందులో చిరంజీవి అయితే బాగుంటుందని అతనితో మాట్లాడగా చిరు కూడా పాజిటివ్ గా స్పందించారు. ఆ సమయంలో సినీ పరిశ్రమ మొత్తం వీరిద్దరి గురించే చర్చించింది. అప్పటికే 'జగదేకవీరుడు అతిలోక సుందరి' సినిమాతో సంచలన విజయాన్ని అందించారు. మళ్లీ వీరిద్దరి హిట్ కాంబినేషన్ వస్తోందని అందరూ భావించారు.

జగదేకవీరుడిని కొట్టాలని : 'జగదేకవీరుడు అతిలోక సుందరి' రికార్డులను అల్లుడుగారు సినిమాతో బ్రేక్ చేయాలని రాఘవేంద్రరావు భావించారు. అటువంటి సమయంలో చిరు నుంచి కబురు వచ్చింది. అల్లుడుగారు సినిమా వద్దని, ఈ కథ క్లైమాక్స్ లో ఉరిశిక్ష పడుతుందని, తాను అలా వెళితే అభిమానులకు నచ్చదన్నారు. దీంతో చిరు నిర్ణయంతో రాఘవేంద్రరావు ఏకీభవించారు. క్లైమాక్స్ లో మార్పులు చేద్దామనుకున్నారు. అయితే కథ మొత్తం క్లైమాక్స్ మీదే ఆధారపడివుటుంది. దీంతో దాన్ని మార్చలేక మోహన్ బాబును హీరోగా ఎంచుకొని బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఈ సినిమాలో అన్ని పాటలు కూడా సూపర్ హిట్. ఇందులో మోహన్ బాబు, శోభన, సత్యనారాయణ , చంద్రమోహన్ తమ నట విశ్వరూపాన్ని ప్రదర్శించారు.












Click it and Unblock the Notifications