నా కల తేజ నెరవేర్చాడన్న చిరంజీవి; ఎమోషనల్ అయిన ప్రశాంత్ వర్మ!!
పద్మ విభూషణ్ గ్రహీత మెగాస్టార్ చిరంజీవి ఇప్పటివరకు 150కిపైగా ఎన్నో సినిమాలలో నటించి, తన నటనా చాతుర్యంతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రస్తుతం విశ్వంభర సినిమా నిర్మాణంలో బిజీగా ఉన్నారు. సినిమా ఇండస్ట్రీ అన్నా, సినిమా ఇండస్ట్రీలో కొత్తగా వస్తున్న యువ నటులు అన్నా అమితమైన ప్రేమను చూపించే మెగాస్టార్ చిరంజీవి సౌత్ ఇండియా ఫెస్టివల్ 2024లో హను మాన్ సినిమాలో నటించిన తేజ సజ్జ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తేజ సజ్జపై చిరంజీవి వ్యాఖ్యలు
హనుమాన్ సినిమా చేసిన తేజ సజ్జ ని చూపిస్తూ అతను 25 ఏళ్ల క్రితం బాల నటుడిగా కెరీర్ ను ప్రారంభించాడని, ఆ తర్వాత ఎంతో ఎత్తుకు ఎదిగాడని వ్యాఖ్యలు చేశారు. తేజ సజ్జ ఇంద్ర సినిమాలో తనతో నటించాడని, అతనికి ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేదని చెప్పిన చిరంజీవి నన్ను అభిమానిస్తూ నా చిత్రాలను స్ఫూర్తిగా తీసుకొని హీరో అయ్యాడు అంటూ వ్యాఖ్యలు చేశారు.

తన కల అతనివల్ల తీరింది
హను మాన్ సినిమాతో తనని తాను నిరూపించుకున్నాడు అని కితాబిచ్చారు. నేను కూడా హనుమంతుడిపై సినిమా చేయాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నా కానీ చేయలేకపోయానని నా ప్రయత్నం కంటే ముందే అతను సినిమా చేసేసాడు అని ఈ విషయంలో తన పూర్తిగా సంతృప్తి చెందానని వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే అతడు కూడా తన ప్రయాణంలో భాగమేనని చిరంజీవి చెప్పాడు.
ఎమోషనల్ అయిన ప్రశాంత్ వర్మ
ప్రస్తుతం తేజ సబ్జా గురించి చిరంజీవి చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చిరంజీవి చేసిన వ్యాఖ్యలకు భావోద్వేగానికి గురయ్యారు. హనుమంతుడి కథ నేపథ్యంలో సినిమా చేయడం చిరంజీవి డ్రీమ్ అని తెలిసి తనకు ఎంతో సంతోషం కలిగిందని చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ అన్నారు.
More than elated to hear Padma Vibhushan @KChiruTweets garu's dream film to act is #HanuMan 😍
— Prasanth Varma (@PrasanthVarma) April 13, 2024
These words imparted more responsibility on my shoulders and I'll forever cherish these words from the Mighty Mega 🌟
I couldn’t control my tears watching this video! I can only… pic.twitter.com/g8gCy0ekqf
కన్నీళ్లు ఆగలేదన్న డైరెక్టర్
ఆయన మాటలు తనపై బాధ్యతను పెంచాయని, ఈ క్షణాలు ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటానని ఆయన ట్వీట్ చేశారు. ఈ వీడియో చూసి తనకు కన్నీళ్లు ఆగలేదని అన్నారు. తేజ సజ్జ ఇప్పుడు ఎలా ఫీలవుతున్నాడో ఊహించగలనని ప్రశాంత్ వర్మ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.
-
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!!












Click it and Unblock the Notifications