షూటింగ్ మొత్తం పూర్తయినా విడుదలకు నోచుకోని చిరంజీవి ఏకైక సినిమా

టాలీవుడ్‌లో నాలుగు దశాబ్దాలకు పైగా తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న మెగాస్టార్ చిరంజీవి ప్రయాణం వెండితెరపై ఒక అద్భుతం. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రయాణం మొదలుపెట్టి, బాక్సాఫీస్‌ను శాసించే స్థాయికి ఆయన ఎదిగిన వైనం ఎందరికో స్ఫూర్తి. అయితే, ఆయన కెరీర్ ఆరంభ రోజుల్లో ఎన్నో అంచనాల మధ్య రూపుదిద్దుకుని, అన్ని కార్యక్రమాలు పూర్తయినా నేటికీ వెలుగు చూడని ఒక సినిమా కథ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.

విశాఖ కేంద్రంగా చిరంజీవి బిగ్ డెసిషన్ - లీక్ చేసిన మాజీ మంత్రి...!!
విశాఖ కేంద్రంగా చిరంజీవి బిగ్ డెసిషన్ - లీక్ చేసిన మాజీ మంత్రి...!!

అన్నీ సిద్ధమైనా వెండితెరకు నోచుకోని 'శాంతి నివాసం'

అప్పట్లో ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు ఉన్న నటి మాధవి, చిరంజీవి జంటగా నటించిన చిత్రం 'శాంతి నివాసం'. బాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ప్రాజెక్ట్‌పై అప్పట్లో మంచి అంచనాలు ఉండేవి. కేవలం షూటింగ్ మాత్రమే కాకుండా, డబ్బింగ్, ఎడిటింగ్, రీరికార్డింగ్ వంటి అన్ని నిర్మాణానంతర పనులు ఎటువంటి అడ్డంకులు లేకుండా ముగిశాయి. సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రచార కార్యక్రమాలు కూడా జోరుగా సాగాయి.

చిరంజీవి - మహేష్‌బాబు కాంబినేషన్‌లో మిస్ అయిన సూపర్ హిట్ మూవీ
చిరంజీవి - మహేష్‌బాబు కాంబినేషన్‌లో మిస్ అయిన సూపర్ హిట్ మూవీ
Chiranjeevi The Unreleased Movie That Remains a Mystery Despite Completed Shooting

నిర్మాత అకాల మరణం.. నిలిచిపోయిన ప్రయాణం

సినిమా విడుదల తరుణంలో ఊహించని పరిణామం చిత్ర యూనిట్‌ను కుదిపేసింది. ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన వ్యక్తి హఠాత్తుగా మరణించారు. ఆ కాలంలో ఇండస్ట్రీలో ఉండే కొన్ని సెంటిమెంట్లు, ఆర్థిక పరమైన సవాళ్ల కారణంగా ఆ సినిమాను మళ్లీ బరిలోకి దించే సాహసం ఎవరూ చేయలేకపోయారు. కాలక్రమేణా పరిస్థితులు మారుతాయని, ఎప్పటికైనా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుందని అంతా భావించినప్పటికీ అది జరగలేదు.

అలా చిరంజీవి సుదీర్ఘ సినీ ప్రయాణంలో షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్నీ పూర్తయినా కూడా విడుదలకు నోచుకోని ఏకైక చిత్రంగా 'శాంతి నివాసం' మిగిలిపోయింది. చిరంజీవి కెరీర్ లో కొన్ని సినిమాలు షూటింగ్ ప్రారంభించుకొని, సగం షూటింగ్ పూర్తిచేసుకొని, సెట్స్ మీదకు వెళ్లి ఆగిపోయిన చిత్రాలున్నాయి కానీ శాంతి నివాసం మాత్రం మొత్తం పూర్తయి విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలోనే అభిమానుల ముందుకు రాకపోవడం విచారకరం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+