సలార్ సక్సెస్ పై చిరంజీవి ట్వీట్; పండుగ చేసుకుంటున్న ప్రభాస్ ఫ్యాన్స్!!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దేశవ్యాప్తంగా ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో, సూపర్ అనిపించే స్క్రీన్ ప్రెజెన్స్ తో సినిమా వీక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది. ఇక సలార్ సీజ్ ఫైర్ సినిమాకు సినీ ప్రముఖుల నుండి ప్రశంసల జల్లు కురుస్తుంది.

ముఖ్యంగా ఇటీవల కాలంలో ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలు తీస్తున్న క్రమంలో అందరి దృష్టి ప్రభాస్ సినిమాలపై పడింది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురిపించారు. ఎక్స్ వేదికగా మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ మై డియర్ దేవా ప్రభాస్ కు హార్దిక శుభాకాంక్షలు. సలార్ బాక్సాఫీస్ వద్ద సెగలు రేపిందని ట్వీట్ చేశారు.

chiranjeevi tweet on prabhas salaar movie success; fans hungama in social media

సలార్ సినిమా కోసం అద్భుతమైన విజయం సాధించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ కు అభినందనలు అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. ప్రపంచ నిర్మాణంలో మీరు రాణిస్తారని దర్శకుడిని కొనియాడారు. పృథ్వి, శ్రుతిహాసన్, జగపతిబాబు, చిత్ర యూనిట్ భువన్ గౌడ్, రవి బస్రూర్, వీసీ చలపతి, నిర్మాత కిరగండూర్ లకు అభినందనలు' అని ట్వీట్ చేశారు.

ఇదిలా ఉంటె డిసెంబర్ 22వ తేదీన విడుదలైన ప్రభాస్ సలార్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇటీవల కాలంలో ప్రభాస్ తన సినిమాలతో అనుకున్నంత హిట్ సాధించలేకపోవడంతో, ఈసారైనా ప్రభాస్ సినిమా హిట్ అవుతుందా లేదా అన్న ఆందోళన మొదట అభిమానులకు ఉండేది.

సలార్ సినిమా అనుమానాలకు చెక్ పెట్టి దూసుకుపోవడం ఇంత కాలానికి మళ్లీ ప్రభాస్ తన మాస్ విశ్వరూపం చూపించటం రెబల్ స్టార్ ఫ్యాన్స్ కు పండుగలా మారింది. ఇక సోషల్ మీడియాలో సలార్ సినిమా హంగామా కనిపిస్తుంది. ప్రభాస్ పోస్టర్లతో సోషల్ మీడియా హోరెత్తిపోతుంది. సలార్ సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్ ల వర్షం కురిపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+