Cinema Lovers Day: ఆ రోజున మల్టీప్లెక్సుల్లో రూ.99కే టికెట్
ఫిబ్రవరి 14వ తేదీన లవర్స్ డే ఉన్నట్టు- సినిమాలంటే పడి చచ్చే ప్రేక్షకులకూ ఓ రోజుంది. అదే- సినిమా లవర్స్ డే (Cinema Lovers Day). ఈ నెల 31వ తేదీన దేశవ్యాప్తంగా సినిమా లవర్స్ డేను జరుపుకోనున్నారు. ఏ సినిమా విడుదలైనా గానీ వదలకుండా మార్నింగ్ షోకే థియేటర్లు, మల్టీప్లెక్సులపై వాలిపోయే ప్రేక్షకులు కోట్లసంఖ్యలో ఉన్నారు. వాళ్లే మాస్ మహారాజులు, సినిమాలకు మహారాజ పోషకులు కూడా.
అలాంటి ప్రేక్షకుల కోసం జాతీయ స్థాయిలో మల్టీప్లెక్సుల యజమానులు సినిమా లవర్స్ డేను నిర్వహించబోతోన్నారు. ఈ నెల 31వ తేదీన ఈ సెలబ్రేషన్స్‌ను ఆర్గనైజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రేక్షకులకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించారు. 31వ తేదీన అన్ని మల్టీప్లెక్సుల్లోనూ 99 రూపాయలకే టికెట్ విక్రయించాలని నిర్ణయించారు.

31వ తేదీన ఫ్రైడే కూడా కావడం కలిసి వచ్చినట్టయింది. సాధారణంగా ఏ వుడ్లో అయినా శుక్రవారం నాడే సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తుంటాయి. ఈ శుక్రవారం నాడు తెలుగులో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గం గం గణేశా, పురుషోత్తముడు సహా వివిధ భాషల్లో ఏకంగా 15 సినిమాలు విడుదల కాబోతోన్నాయి.
రాజ్‌కుమార్ రావ్, జాన్వీ కపూర్ నటించిన మిస్టర్ అండ్ మిసెస్ మహీ, అనిల్ కపూర్, హర్షవర్ధన్ రాణె, దివ్యా ఖోస్లా- సావి, సముద్రఖని, ఉన్ని ముకుందన్- గరుడన్, స్వకార్యం సంభవబహుళం, గౌతమ్ వాసుదేవ్ మీనన్, శరత్‌కుమార్- హిట్ లిస్ట్, ఇంద్రాన్స్, రమ్య సురేష్ నటించిన- కుండల పురాణం సినిమాలు ఆ రోజున విడుదల అవుతాయి.
వాటిని 99 రూపాయలకే చూసేయ్యొచ్చారోజున. ఏపీ, తెలంగాణలో మాత్రం టికెట్ రేట్ 99 రూపాయలకు దొరకవు. సినిమా లవర్స్ డే రోజున ఏపీ, తెలంగాణల్లో మాత్రం మల్టీప్లెక్స్ టికెట్ల రేట్లను 112 రూపాయలుగా నిర్ధారించారు. కొన్ని సెలెక్ట్ చేసిన సినిమాలకు మాత్రమే ఈ టికెట్ ధర వర్తిస్తుంది.












Click it and Unblock the Notifications