భార్యతో ఎన్టీఆర్ గొడవలు.. షాకింగ్ విషయాలు బట్టబయలు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన కెరీర్‌లో ఎన్నో ఎత్తు పల్లాలను చూశారు. తన నటనతో అందర్ని ఆకట్టుకున్నారాయన. ఇక ఎన్టీఆర్ డ్యాన్స్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఇప్పుడున్న హీరోల్లో ఎన్టీఆర్‌కు ఉన్నంత మాస్ ఇమేజ్ మరో హీరోకు లేదంటే అతిశేయోక్తి కాదనిపిస్తోంది. ఇక ఇదే సమయంలో ఎన్టీఆర్ ఫ్యామిలీకి కూడా అధిక ప్రాధాన్యతను ఇస్తుంటారు. ఇటీవలే ఫ్యామిలీతో కలిసి కర్నాటక వెళ్లి అక్కడ దేవాలయాలను సందర్శించరాయన.
సినిమా షూటింగ్‌ల్‌కు గ్యాప్ వస్తే ఇంట్లోనే ఎక్కువ గడుపుతుంటారు. ఆదివారం వస్తే ఎన్టీఆరే వంట చేస్తుంటడని కల్యాణ్ రామ్ ఓ సందర్భంలో చెప్పడం జరిగింది.

ఎన్టీఆర్‌కు ఇద్దరు మగ పిల్లలు. హాలీడేస్ వస్తే వాళ్లను తీసుకుని ఫారెన్‌కు చెక్కేస్తుంటారు. అయితే ఇటీవల ఓ సందర్భంలో తన భార్య లక్ష్మీ ప్రణతితో ఉన్న రిలేషన్ గురించి మొదటిసారి మాట్లాడారు. తాము కూడా అందరి భార్య, భర్తల్లాగే ఉంటామని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. భార్య , భర్తల మధ్య చిన్న చిన్న గొడవలు జరగడం సహజం. మా మధ్య కూడా గొడవలు జరుగుతుంటాయని ఎన్టీఆర్ తెలిపారు. కానీ ఓ విషయంలో మాత్రం ఇద్దరి మధ్య తరుచూ గొడవులు జరుగుతాయని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఏసీ ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడుస్తోందని, ఏసీ ఎంతలో ఉండాలనే విషయంపై గొడవపడేవారమని ఎన్టీఆర్ చెప్పారు. అయితే.. ఎన్టీఆర్ కోసం ఆ విషయంలో లక్ష్మీ ప్రణతి చాలా కాంప్రమైజ్ అయ్యేదని ఎన్టీఆర్ తెలిపారు. తాను మాత్రం ఆమె కోసం ఒక్క విషయంలో కూడా కాంప్రమైజ్ కాలేదని చెప్పుకొచ్చారు.

Clashes between Jr NTR amp amp Lakshmi Pranathi

దీంతో ఎన్టీఆర్-లక్ష్మీ ప్రణతి ఇద్దరు సామాన్య భార్య , భర్తల మాదిరిగానే ఉంటారని ఈ మాటలతో అందరికి అర్థం అయింది. ఎన్టీఆర్ ఆన్‌స్క్రీన్, ఆఫ్‌స్క్రీన్ తెగ మాట్లాడేస్తుంటారు. ఎన్టీఆర్‌కు పూర్తి భిన్నంగా లక్ష్మీ ప్రణతి వ్యవహరిస్తుంటారు. ఆమె బయటకు వచ్చిన సందర్భంలో ఒక్కసారి కూడా మాట్లాడింది లేదు.ఆమె చాలా సైలెంట్‌గా కనిపిస్తారు. ఇక ఎన్టీఆర్ కెరీర్ విషయానికి వస్తే..ఎన్టీఆర్ తాజాగా నటించిన చిత్రం దేవర. ఆరు సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ సింగిల్‌గా నటించిన సినిమా విడుదల కావడంతో అభిమానులు ఆనందానికి హద్దు లేకుండాపోయింది. థియేటర్ల దగ్గర అభిమానుల సందడి కనిపించింది. ఇక బాక్సాఫీస్ వద్ద ఎన్టీఆర్ స్టామినా మరోసారి నిరూపించాడు. ఈ సినిమా మొదటి రోజునే వరల్డ్ వైడ్‌గా రూ. 172 కోట్లు సాధించి చరిత్ర సృష్టించింది. మూడు రోజులు కలిపి ఈ సినిమా రూ.304 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు చేసిన సినిమాగా 'దేవర' నిలిచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+