'శివాజీ'లో విలన్ పాత్రను వదులుకున్న తెలుగు స్టార్ హీరో!
దక్షిణాదిలో అత్యంత భారీ చిత్రాలను తీస్తాడనే పేరును సంపాదించుకున్న శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం శివాజీ. ఈ సినిమా సంచలన విజయాన్ని సాధించింది. సమాజానికి మంచి చేయాలనే తపనతో ఉన్న హీరోను వెలన్ దెబ్బకొడితే హవాలాద్వారా డబ్బును తిరిగి భారతదేశానికి రప్పించి, విలన్ పై పైచేయి సాధించే పాత్రలో రజనీకాంత్ సూపర్ అనిపించారు. రజనీకి ధీటుగా విలన్ పాత్రలో సుమన్ నటించారు. ఈ సినిమాద్వారా సుమన్ మంచిపేరును సంపాదించడమేకాకుండా తెలుగు, తమిళ భాషల్లోని ప్రేక్షకులందరికీ ఎంతో దగ్గరయ్యారు.
వాస్తవానికి ఈ సినిమాలో సుమాన్ పాత్రను మొదట కలెక్షన్ కింగ్ మోహన్ బాబుచేత చేయిద్దామని దర్శకుడు భావించారు. కథ చాలా బాగుంటుందని, ఒకసారి వినమని మోహన్ బాబుకు స్నేహితుడైన రజనీకాంత్ కూడా చెప్పారు. అయితే అది విలన్ పాత్ర కావడంతో మోహన్ బాబు తిరస్కరించారు. ఆ పాత్ర కాకుండా సినిమాలో ఏదైనా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్ర ఉంటే ఇవ్వాలని, అందులో నటిస్తానని మోహన్ బాబు రజనీకి చెప్పాడు. అయితే మోహన్ బాబును కూడా ఒత్తిడి చేయడం ఇష్టంలేక రజనీకాంత్, శంకర్ సుమన్ వైపు మొగ్గుచూపారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతోపాటు సుమన్ కు మంచి పేరును కూడా సంపాదించిపెట్టింది.

మోహన్ బాబు కోరికమీదే పెదరాయుడు సినిమాలో అతని తండ్రిగా రజనీకాంత్ నటించారు. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. పాపారాయుడిగా రజనీకాంత్ పోషించిన పాత్ర చిరస్థాయిగా నిలిచిపోవడమే కాకుండా సినిమా ఘన విజయంలో కీలక పాత్ర పోషించింది. మోహన్ బాబు తనకు స్నేహితుడవడంవల్లే పారితోషికంగా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా రజనీ నటించారు. మోహన్ బాబు, రజనీకాంత్.. ఇప్పటికీ మంచి ప్రాణ స్నేహితులుగా పరిశ్రమలో కొనసాగుతున్నారు.












Click it and Unblock the Notifications