అత్తకు లిప్ కిస్ ఇచ్చిన కమెడియన్ అల్లుడు
తమిళ నటుడు రోబో శంకర్ ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. ఆయన అల్లుడు చేసిన పని ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. పెళ్లి వేడుకలో ఏకంగా రోబో శంకర్ భార్యకు అల్లుడు లిప్ కిస్ ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే..నటుడు రోబో శంకర్‌కు తమిళ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. బుల్లితెర షోల ద్వారా పాపులర్ అయిన రోబో శంకర్ తరువాత పలు సినిమాల్లో నటించి ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు.
తొలుత చిన్న సినిమాల్లో నటిస్తూ.. తన కెరీర్‌ను ప్రారంభించిన రోబో శంకర్..ఇప్పుడు పెద్ద హీరోల సినిమాల్లో నటించే స్టేజ్‌కి ఎదిగాడు. మారి, వాయై మూడి పేశవం, విశ్వాసం, ఎలెన్ను వందుట్టా వెల్లైకారన్ లాంటి చిత్రాలతో రోబో శంకర్ ఫుల్ పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఇటీవలే రోబో శంకర్ తన కూతురు ఇంద్రజ శంకర్‌కు వివాహం చేశాడు. ఇంద్రజ శంకర్ కూడా పలు సినిమాల్లో నటించింది.

విజయ్ బిగిల్ చిత్రంలో ఫుట్ బాల్ ప్లేయర్‌గా నటించిన ఇంద్రజ శంకర్..విశ్వక్ సేన్ పాగల్ చిత్రంలో ఒక పాటలో మెరిసింది.తమిళ దర్శకుడు కార్తీక్‌తో ఇంద్రజ శంకర్ వివాహం జరిగింది. కూతురు పెళ్లి సింపుల్‌గా చేసిన రోబో శంకర్.. రిసెప్షన్‌ను మాత్రం గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ రిసెప్షన్‌కి చాలా మంది సెలబ్రిటీలు సందడి చేశారు. కమల్ హాసన్, శివకార్తికేయన్ వంటి స్టార్ హీరోలు రిసెప్షన్‌కి హాజరై వధూవరులని ఆశీర్వదించారు.
ఇదిలా ఉంటే రిసెప్షన్ వేడుకలో కొత్త పెళ్ళికొడుకు కార్తీక్ చేసిన పని తీవ్ర వివాదానికి దారి తీసింది. రిసెప్షన్‌లో వేదికపై డ్యాన్స్ చేసిన కార్తీక్ ..తన అత్తగారు ప్రియాంకకి లిప్ కిస్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన ఫొటోలు , వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అత్తగారితో అల్లుడు ఈ విధంగానేనా ప్రవర్తించేది అంటూ నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications