couplefriendly: ఈ ట్రైలర్ ఏంటి ఇలా ఉంది..!
టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్.. మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 'కపుల్ ఫ్రెండ్లీ' అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. లవర్స్ డే రోజు ఫిబ్రవరి 14న ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా రిలీజైన ట్రైలర్ యూత్ ను ఆకట్టుకుంటోంది. ట్రైలర్ లో ముద్దులు, హగ్గులు ఓ రేంజ్ లో ఉన్నాయంటున్న నెటిజన్లు, యూత్ ఆడియెన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన తాజా చిత్రం 'కపుల్ ఫ్రెండ్లీ'.. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. తాజాగా రిలీజైన ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ ను ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఒక యువ జంట మధ్య సాగే సహజీవనం, వారి ప్రయాణంలో ఎదురయ్యే సరదా సన్నివేశాలు, కుటుంబాల మధ్య తలెత్తే సంఘర్షణలతో ఈ చిత్రం రూపుదిద్దుకున్నట్లు ట్రైలర్ చూస్తుంటే స్పష్టం అవుతోంది.

ఇక ఈ ట్రైలర్ లో హగ్గులు, ముద్దు సీన్లు చాలా ఉన్నాయి. ఎంత మంది అమ్మాయిల జీవితాల్ని నాశనం చేసావ్..? అని హీరోయిన్ అడగ్గా.. 'నా జీవితం తప్ప నేను ఇంకెవరి జీవితాన్ని పాడుచేయలేదు' అని హీరో చెప్పే సంభాషణలు ట్రైలర్ లో హైలెట్ గా నిలిచాయి. హీరో సంతోష్ శోభన్, ఓ అమ్మాయికి ఎలా దగ్గరవుతాడు..? ఆమెతో పరిచయం పెంచుకొని రూమ్ కు ఎలా తీసుకెళ్తాడు..? ఆ తర్వాత వారిద్దరి మధ్య చిగురించే లవ్ స్టోరీనే ఈ ఫ్రెండ్లీ కపుల్ మూవీ అని తెలుస్తోంది. సహజీవనం వల్ల భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటాయనే విషయాన్ని దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించినట్లు ఈ ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. మరి ఈ సినిమా యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications