మహేష్ బాబు కూతురు సితారనూ వదలని సైబర్ నేరగాళ్ళు.. పోలీసులకు ఫిర్యాదు!!
సైబర్ నేరగాళ్లు సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు ఏ ఒక్కరిని వదిలిపెట్టడం లేదు. ఏ చిన్న అవకాశం దొరికినా ఎవరి పేరునైనా వాడుకోవడానికి, ఎవరి ఫోటోలైనా వాడుకోవడానికి సైబర్ నేరగాళ్లు సిద్ధమవుతున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె ఘట్టమనేని సితార పేరుతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.ఇక ఈ విషయాన్ని గుర్తించిన మహేష్ బాబు టీమ్ మాదాపూర్ పోలీసులకు , సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అసలు ఇంతకీ ఏం జరిగిందంటే.. సితార పేరుతో ఇన్ స్టాగ్రామ్ నకిలీ ఖాతాలను తెరిచిన కొందరు సైబర్ నేరగాళ్లు ఇన్వెస్ట్మెంట్ లు, ట్రేడింగ్ లింకులను ప్రజలకు పంపుతున్నారు. ఇక ఈ విషయాన్ని గుర్తించిన ఘట్టమనేని మహేష్ బాబు టీమ్ (జి ఎం బి టీమ్) సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

సితార పేరుతో ఎవరికి ఎటువంటి లింకులు పంపలేదని, ఒకవేళ ఎవరికైనా సితార పేరుతో లింకులు వస్తే వాటిని ఫేక్ గా గుర్తించాలని వారు చెబుతున్నారు. సితార పేరుతో ఫేక్ ఇన్ స్టాగ్రామ్ ఖాతాలను తెరిచి లింకులు పంపుతున్నట్టు గా, అటువంటి వాటిని నమ్మొద్దని వారు చెబుతున్నారు. ఎవరైనా సెలబ్రిటీల పేరుతో అనుమానాస్పద లింకులు వస్తే అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
ఇక ఇదే విషయాన్ని తాజాగా మహేష్ బాబు భార్య నమ్రత తన instagram లో ఒక నోట్ విడుదల చేశారు. కొందరు సితార పేరుతో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి డబ్బు కోసం సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని, ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. అనుమానాస్పదంగా ఎటువంటి లింకులు వచ్చినా వాటి గురించి అప్రమత్తంగా ఉండాలని నమ్రత సూచించారు.
ఇటువంటి లింకులపై అధికారులకు ఫిర్యాదు చేయాలని ఆమె ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు పెట్టారు. ప్రతీ ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ప్రస్తుతం ఈ ఫిర్యాదుపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే నేరగాళ్లను పట్టుకుంటామని చెబుతున్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications