మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..
నా రూటే సెపరేటు అంటున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్. చూడ్డానికి లవర్ బాయ్ లా ఉన్నా ఈ హీరో ఎంచుకునే సబ్జెక్ట్ లు మాత్రం ఇంటర్నేషనల్ రేంజ్ లో ఉంటాయి. ఆయన సినిమాలు కూడా థియేటర్ల వద్ద అలాగే వసూళ్లు సృష్టిస్తాయి. క్షణం, హిట్-2, ఎవరు, గూఢచారి, మేజర్ చిత్రాలతో తనకంటూ సెపరేట్ ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడీ యంగ్ హీరో. అయితే తాజాగా 'డెకాయిట్' మూవీతో వచ్చి మరోసారి సాలిడ్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.
మేజర్ చిత్రం తర్వాత అడివి శేష్ నటించిన చిత్రం 'డెకాయిట్'.. అంటే మేజర్ రిలీజైన దాదాపు మూడేళ్ల తర్వాత డెకాయిట్ వచ్చింది. కానీ లేట్ గా వచ్చినా ఆయన ఇవ్వాల్సింది ఇచ్చే పోతాడు. మూవీకి హిట్ టాక్ వచ్చింది. చివరి 40 నిమిషాలు ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయని అంటున్నారు. ఇదో రివెంజ్ తో కూడిన క్లాసిక్ లవ్ స్టోరీ అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. అడివి శేష్ అన్న మూడేళ్లకోసారి వచ్చినా రూ. 150 టికెట్ డబ్బులకు న్యాయం చేస్తాడని.. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడని సోషల్ మీడియాలో ఆయన ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
ఇక బుక్ మై షో యాప్ లెక్కల ప్రకారం.. ఈ చిత్రానికి మొదటి మూడు రోజుల్లోనే దాదాపు 5 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోయాయి. అలాగే డిస్ట్రిక్ట్ యాప్ లో అమ్ముడైన టిక్కెట్స్ ను కూడా కలిపితే ఆ లెక్క 8 లక్షలకు చేరిందని అంటున్నారు. ఇక ఈ సినిమాను దాదాపు రూ. 60 కోట్లతో తెరకెక్కించారు నిర్మాతలు. అయితే ఈ చిత్రం నిర్మాతలకు తొలి మూడు రోజుల్లోనే లాభాల్లోకి వెళ్లేలా చేసిందని టాక్. ఇక తెలంగాణ ప్రాంతం నుండి ఈ చిత్రానికి మొదటి మూడు రోజులకు కలిపి రూ. 8 కోట్ల 30 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు సమాచారం.

అలాగే ఆంధ్రా, సీడెడ్ చూస్తే డెకాయిట్ చిత్రానికి రూ. 5 కోట్ల 60 లక్షలు గ్రాస్ వచ్చినట్లు సమాచారం. ఇక కర్ణాటక నుంచి రూ. 2 కోట్ల 70 లక్షలు రాగా, హిందీ నుంచి ఈ మూవీకి రూ. 85 లక్షల వరకు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఓవర్సీస్ లో అడివి శేష్ సినిమాలకు మంచి ఆదరణ ఉన్న విషయం తెలిసిందే. ఆయన గత సినిమాలు కూడా ఓవర్సీస్ లో లాభాలు తెచ్చాయి. ఇప్పుడు డెకాయిట్ కూడా ఓవర్సీస్ లో విజయవంతంగా రన్ అవుతోంది. ఈ చిత్రానికి ఓవర్సీస్ నుండి ఏకంగా రూ. 10 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రావడం విశేషం. ఇక ఓవరాల్ గా చూస్తే మొదటి వీకెండ్ లోనే ఈ చిత్రానికి రూ. 32 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications