సంచలనం: 'దేవర' అడ్వాన్స్ బుకింగ్స్ ఎన్ని రూ.కోట్లో తెలుసా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో నటించిన దేవర చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈనెల 27వ తేదీన విడుదల కాబోతోంది. గురువారం అర్థరాత్రి నుంచే షోలు వేస్తున్నారు. ఒంటిగంటకు ఇవి ప్రారంభం కానున్నాయి. సినిమా విడుదలకు ముందే దేవర సృష్టిస్తున్న రికార్డులు చూస్తుంటే మతిపోతోంది. ప్రీమియర్ షోస్, ప్రీసేల్స్ అమ్మకాల ద్వారా అమెరికాలో రెండు మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసింది. ఈ విషయాన్ని దేవర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.

విడులకు ఒకరోజే సమయం
సినిమా విడుదలకు ఇంకా ఒకరోజే సమయం ఉంది. ఆ సమయానికి నాలుగు మిలియన్ డాలర్లకు చేరుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ట్రేడ్ పండితులు అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా రెండు మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరగా త్వరలోనే నాలుగు మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరనుంది. ఒకరకంగా ఇది సంచలనం అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విడుదలకు ముందే రూ.50 కోట్లు అడ్వాన్స్ రూపంలో రావడం అంటే మాములు విషయం కాదని, తారక్ సంచలన రికార్డుల దిశగా పయనిస్తున్నాడంటున్నారు.

Devara created a sensational record with 50 crores with advance booking

బాగుందనే టాక్ వస్తే చాలు
గతంలో రామ్ చరణ్ తో కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా రెండు మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరింది. తర్వాత సోలో హీరోగా వస్తున్న దేవర కూడా ఈ క్లబ్ లో అడుగుపెట్టింది. సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయనేదానికి ఇది నిదర్శనమంటున్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వాలు అనుమతిచ్చాయి. దీంతో గ్రాస్ వసూళ్లు ఏ స్థాయిలో వస్తాయనేది చూడాలి. హిందీలో కరణ్ జోహార్ విడుదల చేస్తున్నాడు కాబట్టి మంచి థియేటర్లే దొరికాయి. సినిమాకు మంచి టాక్ వచ్చిందంటే చాలు దుమ్ము దులపడం ఖాయమని తారక్ అభిమానులు నమ్మకంగా చెబుతున్నారు. వారి నమ్మకం నిజమవుతుందో లేదో చూడాలంటే మరో రోజు ఆగితే సరిపోతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+