వరల్డ్‌లో నెంబర్ 2... జూనియర్ ఎన్టీఆర్ అరుదైన రికార్డ్
కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించగా ఈనెల 27వ తేదీన విడుదలైన దేవర చిత్రం సంచలన వసూళ్ల దిశగా పయనిస్తోంది. సినిమాకు మిక్స్ డ్ టాక్ రావడంతో కలెక్షన్లు తగ్గుతాయని భావించినప్పటికీ టాక్ తో సంబంధం లేకుండా దూసుకుపోతోంది. కొంతమంది మొదటి భాగం బాగుందంటుంటే మరికొందరు మాత్రం రెండో భాగం బాగుందంటున్నారు. సినిమాకు ఎన్టీఆర్, అనిరుధ్ రవిచందర్ మూలస్తంభాలుగా నిలిచారు. మొదటి నాలుగు రోజుల్లోనే కొన్ని ప్రాంతాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించింది.
దివైల్డ్ రోబోకు 44 మిలియన్ డాలర్లు
ఈనెల రెండోతేదీన గాంధీ జయంతి కావడంతో సెలవు దినం. తర్వాత మూడోతేదీ నుంచి 12వ తేదీ వరకు వరుసగా దసరా సెలవులున్నాయి. వీటిని అనుకూలంగా మార్చుకుంటే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుంది. మొదటివారంలో ప్రపంచవ్యాప్తంగా 32.93 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. హాలీవుడ్ సినిమాలను కూడా వెనక్కి నెట్టి అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా దేవరతో జూనియర్ ఎన్టీఆర్ అరుదైన ఫీట్ సాధించాడు. గతవారంలో హాలీవుడ్ సినిమా ది వైల్డ్ రోబో 44 మిలియన్ల వసూళ్లు సాధించింది.

మూడు రోజుల్లోనే 32.93 మిలియన్ డాలర్లు
మూడురోజుల్లోనే 32.93 మిలియన్లు రాబట్టి దేవర రెండోస్థానంలో నిలవడం విశేషం. ఉత్తర అమెరికాలో 5.12 మిలియన్ డాలర్లు వసూలు చేసి నాలుగో స్థానంలో నిలిచింది. ఏపీ, తెలంగాణ నుంచి వచ్చిన వసూళ్లు ప్రపంచవ్యాప్తంగా దేవరను రెండోస్థానంలో నిలబెట్టాయి. సోమవారం కూడా మంచి కలెక్షన్లు రాబట్టిన దేవర మండే టెస్ట్ లో ఉత్తీర్ణత సాధించినట్లే. దసరా సెలవులతో భారీ వసూళ్లు సాధించే అవకాశం కనపడుతోంది. అమెరికన్ సినిమా బీటెల్ జ్యూస్ 29.64 మిలియన్ డాలర్లు, ట్రాన్స్ ఫార్మర్స్ వన్ 25.90 మిలియన్ డాలర్లు, స్పీక్ నో ఇవిల్ 9.6 మిలియన్ డాలర్లతో టాప్ 5లో నిలిచాయి.












Click it and Unblock the Notifications